మే 12 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు గొప్పగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఏదైనా ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది మీ వ్యక్తిత్వంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. స్నేహితులు లేదా బంధువులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. అవసరమైనవారికి సహాయం చేస్తారు. కెరీర్లో మంచి ప్రయోజనాలు పొందుతారు.
వృషభ రాశి
మీ ప్రతిభ వెలుగుచూస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల సలహాలు స్వీకరించండి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వైవాహిక జీవితంలో పరస్పర సమన్వయం పెరుగుతుంది. మొత్తంమీద ఈ రోజు మంచి రోజు అవుతుంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలు సాధిస్తారు.
మిథున రాశి
వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. కొత్త ప్రణాళికలు అమలుచేయడంలో సక్సెస్ అవుతారు. మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది. పెద్ద బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి
కర్కాటక రాశి
ఈ రోజు మీకు మంచి ఫలితాలున్నాయి. అసంపూర్ణ పనులపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. మీ పనితీరు మార్చుకోవాలి అనుకుంటే మంచే జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సమన్వయం ఉంటుంది. ఉద్యోగం కోసం ఇంటర్యూలకు హాజరవుతారు. మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి.
సింహ రాశి
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. కార్యాలయ అంతర్గత వ్యవస్థను మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉంది. మీ పురోగతి చూసి అసూయపడేవారున్నారు. మనసు చెప్పిందే చేయండి. విద్యార్థులు అధ్యయనాలపై ఆసక్తి చూపిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కెరీర్లో బిజీగా ఉంటారు.
కన్యా రాశి
ఈ రోజు ఏ కాల్ ని కూడా విస్మరించవద్దు. ఏదైనా ప్రత్యేక సమాచారాన్ని పొందుతారు. మీరు దగ్గరి వ్యక్తికి సహాయం చేయడం ఆనందంగా ఉంటుంది. ఇంటి వ్యవస్థను సమర్థించడంలో మీ ప్రయత్నం విజయవంతమవుతుంది. రేపు మీకు కుటుంబంతో ఒక వేడుకకు వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనిలో పురోగతి ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. మీ ప్రణాళికలు విజయవంతం అవుతాయి. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. కెరీర్లో శుభఫలితాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.
వృశ్చిక రాశి
వ్యాపారంలో ఫ్యూచర్ ప్రణాలికల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయం ఈరోజు తీసుకోవద్దు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. రాజకీయాలతో సంబంధం ఉండేవారు ఈ రోజు గౌరవం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించిన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది
ధనస్సు రాశి
ఈ రోజు మాటతీరు జాగ్రత్తగా ఉండాలి. మీపై ఆధిపత్యం చెలాయించేవారిని అనుమతించవద్దు. డబ్బుని సరైన దిశగా ఖర్చు చేస్తారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు సామాజిక పనులపై ఆసక్తి కలిగి ఉంటారు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. రాజకీయాలతో సంబంధం ఉండేవారికి మంచి జరుగుతుంది
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అడుగు ముందుకు వేస్తారు. మీ ప్రియమైన వారి సహాయంతో పనులు పూర్తిచేస్తారు. మీడియా, మార్కెటింగ్ వ్యాపారంతో సంబంధం ఉండేవారికి ఇది విజయవంతమైన సమయం. మీరు మొండిగా వ్యవహరించడం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి.
కుంభ రాశి
మీరు అనుకున్న ప్రకారం పని పూర్తవుతుంది. పూర్తి విశ్వాసంతో అడుగు ముందుకు వేయండి. వాహనం కొనడానికి ఒక ప్రణాళిక ఉంటే ఈ రోజు అడుగు ముందుకు పడుతుంది. బంధువులు, స్నేహితులతో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. ఏవైనా ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ ఆత్మవిశ్వాసం తగ్గించుకోవద్దు. వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది.
మీన రాశి
ఈ రోజు మీకు గొప్పగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉండేవారు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. చేతికందాల్సిన డబ్బు సమయానికి రాదు. తప్పులు నుంచి పాఠాలు నేర్చుకోవడం మొదలుపెట్టండి. విద్యార్థులు పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు పెద్ద ఆన్ లైన్ ఆర్డర్లు పొందుతారు.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.