Walking vs Cycling for Weight Loss : ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్, జాగింగ్ కొందరు రెగ్యులర్​గా చేస్తారు. సైక్లింగ్​ని కొందరు కార్డియోలో భాగంగా.. లేదా ఇతర ఫిట్​నెస్ కారణాల దృష్ట్యా చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు సైక్లింగ్ చేస్తే మంచిదా? వాకింగ్ చేస్తే మంచిదా? ఈ రెండు వ్యాయామాల్లో బరువును వేగంగా తగ్గించే సత్తా దేనికి ఉందో తెలుసా? 


బరువు తగ్గాలనుకునేవారికి సైక్లింగ్, వాకింగ్ కూడా మంచి ఆప్షన్సే అంటున్నారు నిపుణులు. ఈ రెండిటీ వల్ల బరువు తగ్గుతారు. కానీ వేగంగా బరువు తగ్గేందుకు ఏది బెస్టో.. ఏది మీకు సూట్ అవుతుందో తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు. అది తెలుసుకోవాలంటే వాకింగ్ వల్ల కలిగే లాభాలు ఏంటో.. సైక్లింగ్ చేయడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోవాలి. అప్పుడే బరువు తగ్గడాన్ని ఏది వేగవంతం చేస్తుందో తెలుస్తుంది. 


కేలరీలు..


బరువు తగ్గడంలో కేలరీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిని ఎంత బర్న్ చేస్తే.. బరువు తగ్గే అవకాశాలు అన్ని ఎక్కువ అవుతాయి. మరి వాకింగ్, సైక్లింగ్ వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు చేయవచ్చో తెలుసా?



  • వాకింగ్ గంటకు 3 నుంచి 4 మైళ్లు నడిస్తే.. గంటకు 150 నుంచి 200 కేలరీలు ఖర్ఛు అవుతాయట. 

  • సైక్లింగ్ గంటకు 10 నుంచి 12 మైళ్లు తొక్కితే.. 400 నుంచి 600 కేలరీలు కరుగుతాయి. 


కండర బలం 


కండర బలం పెరిగితే శరీరంలోని కొవ్వు తగ్గిపోతూ ఉంటుంది. ఫిట్​గా బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. 



  • వాకింగ్ చేయడం వల్ల కాళ్లు, హిప్స్, లోయర్ బ్యాక్ కండరాలు ఫిట్​ అవుతాయి. 

  • సైక్లింగ్ వల్ల కాళ్లు, హిప్స్, లోయర్ బ్యాక్​తో పాటు కోర్ మజిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. 


కీళ్లపై ప్రభావం


వాకింగ్ ఎక్కువగా చేస్తే కీళ్లపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. సైక్లింగ్ చేస్తే కీళ్లు అరిగిపోతాయంటూ కొందరు ఫీల్ అవుతారు. ఇంతకీ అవి నిజమేనా? నిజమే అంటున్నారు నిపుణులు. వాకింగ్, సైక్లింగ్ అనేవి.. కీళ్లపై కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయట. 



  • నడకవల్ల కీళ్లు.. ముఖ్యంగా మోకాలు, హిప్స్​పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట. 

  • సైక్లింగ్ చేస్తే కీళ్లపై తక్కువ ప్రభావం ఉంటుంది వాకింగ్​తో కంపేర్ చేస్తే. 


కాబట్టి కీళ్ల సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. 


ఆలోచించాల్సిన విషయాలివే.. 


వాకింగ్ అనేది ఎప్పుడైనా.. ఎక్కడైనా చేయవచ్చు. ఎలాంటి పరికరాలు అవసరం ఉండదు. సైక్లింగ్​కి అలా కాదు. సైకిల్ కావాలి. అవుట్​సైడ్ సైక్లింగ్ చేస్తే మంచి రూట్ ఉండాలి. 


బరువు దేనివల్ల త్వరగా తగ్గుతారంటే.. 



  • వాకింగ్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. మీరు హెల్తీ డైట్ తీసుకుంటూ బరువు తగ్గాలనుకుంటే వాకింగ్ మంచి ఆప్షన్. 

  • సైక్లింగ్ వల్ల కూడా బరువు తగ్గుతారు. వాకింగ్ కంటే సైక్లింగ్ వల్లనే వేగంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే కేలరీలు ఎక్కువ బర్న్ అవుతాయి కాబట్టి వేగంగా బరువు తగ్గే అవకాశముంది. 


హెల్తీగా వేగంగా బరువు తగ్గాలనుకుంటే ఈ రెండిటీని కూడా కలిపి చేయవచ్చు. ఉదయాన్నే వాకింగ్ చేయడం. సాయంత్రం సైక్లింగ్ చేయడం. లేదా మార్నింగ్ సైక్లింగ్.. ఈవెనింగ్ వాకింగ్ చేయొచ్చు. దీనికి తోడు హెల్తీ డైట్ ఉంటే బరువు తగ్గడంలో వండర్స్ చూస్తారు. అంతేకాకుండా గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. హెల్తీగా, ఫిట్​గా ఉంటారు.



Also Read : పిల్లలకు పేరెంట్స్ కచ్చితంగా నేర్పించాల్సిన 10 అలవాట్లు ఇవే.. ఆరోగ్యం విషయంలో అస్సలు రాజీ పడకండి