Hidden Fat Dangers : చెడు కొవ్వు. మంచి కొవ్వు. బాడీ ఫ్యాట్​ గురించి మాట్లాడితే వీటి గురించే ఎక్కువగా చెప్తారు. హెల్తీ ఫ్యాట్ ఆరోగ్యానికి మేలు చేస్తే చెడు కొలెస్ట్రాల్​ ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అలాంటి వాటలో బెల్లీ ఫ్యాట్ ఒకటి. ఇది గుండెకు, ఆరోగ్యానికి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తుంది. అయితే దీనికంటే డేంజర్​ ఫ్యాట్ మరొకటి ఉంది. అదే విసెరల్ ఫ్యాట్. ఈ కొవ్వు అవయవాల చుట్టూ పేరుకుని.. పూర్తి ఆరోగ్యాన్ని తక్కువ సమయంలో నాశనం చేస్తుంది. అందుకే దీని గురించి అవగాహన ఉండాలని అంటున్నారు నిపుణులు. 

Continues below advertisement


విసెరల్ ఫ్యాట్ లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్ చుట్టూ పేరుకుంటుంది. ఇది కనిపించదు కానీ.. తక్కువ మోతాదులో పేరుకున్నా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయట. ఈ ఫ్యాట్ పేరుకుపోవడానికి కారణాలు ఏంటో.. ఎలా ఈ సమస్యను దూరం చేసుకోవాలో.. ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అయితే ఈ విసెరల్ ఫ్యాట్ తగ్గిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


విసెరల్ ఫ్యాట్ 


విసెరల్ ఫ్యాట్ అవయవాల చుట్టూ ఏర్పడుతుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేసే రసాయనాలు విడుదల చేస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక కొలెస్ట్రాల్, క్రోనిక్ ఇన్​ఫ్లమేషన్, గుండె సమస్యలు, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే దీనిని బెల్లి ఫ్యాట్ కంటే ప్రమాదకరం అంటారు. 


విసెరల్ ఫ్యాట్​కు కారకాలు.. 


షుగర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ తీసుకోవడం వల్ల విసెరల్ ఫ్యాట్ వస్తుంది. అలాగే సరైన జీవనశైలిని ఫాలో అవ్వకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి వల్ల కూడా ఇది వస్తుంది. సరైన నిద్ర లేక కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. 


విసెరల్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్


విసెరల్ ఫ్యాట్​ని దూరం చేసుకోవడానికి ముందుగా తీసుకునే ఆహారంపై ఫోకస్ చేయాలి. మెటబాలీజాన్ని పెంచి.. ఇన్​ఫ్లమేషన్​ని తగ్గించే ఫుడ్స్ తీసుకోవాలి. పాలకూర, బ్రోకలి వంటి ఆకుకూరలు తీసుకోవాలి. ఓట్స్, బ్రౌన్ రైస్, ఫ్యాటీ ఫిష్, బాదం, చియాసీడ్స్, యోగర్ట్, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఫుడ్స్​తో పాటు గ్రీన్ టీ వంటివి తీసుకుంటే విసెరల్ ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. 


రెగ్యులర్​గా చేయాల్సిన పనులివే.. 


విసెరల్ కొవ్వుని దూరం చేసుకోవడానికి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. రెగ్యులర్​గా వ్యాయామం చేయాలి. కనీసం రోజుకు 30 నుంచి 60 నిమిషాలు ఎక్సర్​సైజ్ చేయాలి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి చేసి కార్టిసాల్​ని తగ్గించుకోవచ్చు. కనీసం 7 నుంచి 9 గంటలు పడుకోవాలి. నిద్రనాణ్యతను పెంచుకోవాలి. వీటిని రెగ్యులర్​గా ఫాలో అవ్వడం వల్ల విసెరల్ ఫ్యాట్ తగ్గుతుంది. 


విసెరల్ ఫ్యాట్​ని గుర్తిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. వాటితో పాటు ఈ టిప్స్ ఫాలో అయితే కచ్చితంగా మంచి రిజల్ట్స్ చూస్తారు. లేకుంటే మీరు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.