Chankya Niti In Telugu: ఆచార్య చాణక్యుడు, విష్ణుగుప్తుడు ఇద్దరూ ఒకరే. చాణక్య విధానాలు భారతీయ చరిత్రలో ముఖ్యమైన పుస్తకంగా పరిగణిస్తారు. ఇందులో రాజకీయాలు, పరిపాలనలో మార్గదర్శకాలు మాత్రమే కాదు జీవితంలోని ప్రతి అంశంలోనూ విజయానికి చాణక్య విధానాలు ముఖ్యమైనవి అని చెబుతారు. తమ విధానాల్లో శత్రువులను ఓడించేందుకు కొన్ని సూచనలు చేశారు ఆచార్య చాణక్యుడు. ఈ విధానాలకు ఉపయోగిస్తే శత్రువులను ఓడించడం చాలా తేలిక. మీరు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు.
శత్రువుని జయించేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలివే..
బలహీనంగా చూడొద్దు
శత్రువును ఎప్పుడూ బలహీనంగా , తక్కువగా చూడొద్దు. వారు మీకు ఏ విధంగానైనా హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారనే ఆలోచనతో ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. శత్రువు దుష్ట స్వభావం ఉన్నా, శత్రువు మీతో సమాన శక్తితో ఉన్నా వారిని బలవంతులుగా భావించి ఓ అడుగు ముందే ఆలోచించాలి సహనం సంయమనం
సహనం , సంయమనం అనేది ప్రతి వ్యక్తిలో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. మీరు శత్రువుకు దగ్గరగా ఉన్నప్పుడు, సహనం సంయమనం కలిగి ఉండటం చాలా ముఖ్యం. అలాంటప్పుడు మాత్రమే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సరైన సమయం కోసం వేచి ఉండండి
ఏదైనా పని చేసే ముందు సరైన సమయం కోసం వేచి చూడండి. అప్పుడు మాత్రమే మీరు చేసే పనికి తగిన ఫలితం పొందుతారు. శత్రువు ఏదైనా చర్య తీసుకోవాలనుకున్నప్పుడు సరైన సమయం కోసం వేచి ఉండండి. ముందుగా బలమైన ప్రణాళికను సిద్ధం చేయండి.
సహాయం తీసుకోండి
అత్యవస సమయంలో ఇతరుల సహాయం పొందడం తప్పు కాదు. ఎందుకంటే ప్రతిపనినీ ఒంటరిగా చేయలేం. కొన్ని సందర్భాల్లో శత్రువుని ఎదుర్కోవాలంటే మీరు ఒంటరిగా పోరాడలేరు..ఆ సమయంలో ఇతరుల సహాయం అవసరం. బలహీనత తెలుసుకోండి శత్రువును ఓడించాలంటే ముందుగా వారి బలహీనత ఏంటో తెలుసుకోండి. అప్పుడే శత్రువుని సులభంగా ఓడించగలరు.ఎట్టి పరిస్థితుల్లోనూ మీ బలహీనతను వెల్లడించనివ్వకండి. అది మీ వరకే పరిమితం కావాలి.
రాజకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేసి ప్రత్యర్థిని ఓడించగల ప్రజ్ఞ చాణక్యుడి సొంతం. తనను అత్యంత ఘోరంగా అవమానించిన నందరాజులను గద్దెదించి సామాన్య జీవితం గడుపుతున్న చంద్రగుప్తుణ్ని రాజుగా చేయడమే కాదు ఏకంగా నంద వంశాన్ని భూస్థాపితం చేశారు ఆచార్య చాణక్యుడు. వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా కానీ చతురతతో లక్ష్యాన్ని సాధించడమే చాణక్యుడి సూత్రం. అయితే మనం ఎంచుకునే మార్గం ఇతరులకు ఎలాంటి హాని కలిగించేది అయి ఉండకూడదు అని సూచించారు.
గమనిక: పుస్తకాల్లో పేర్కొన్న కొన్ని వివరాల ఆధారంగా పేర్కొన్న వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..
రామాయణ, మహాభారత కాలంలో ఒకే సమయంలో యుద్ధవిరమణ - ఇప్పుడు భారత్ పాక్ మధ్య కూడా అదే సమయంలో జరిగిందా? ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
పాండవుల దూతగా కౌరవుల సభలో అడుగుపెట్టిన శ్రీకృష్ణుడు యుద్ధం విరమించాలని కోరాడు. ఆ సమయంలో ఏం చెప్పాడో వివరిస్తూ.. భారత్ - పాక్ యుద్ధవిరామ సమయంలో DGMO బ్రీఫింగ్ ప్రారంభించారు..ఆ కవిత ఇదే