మే 15 రాశిఫలాలు
మేషం రాశి (Aries) - 2025 మే 15
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు విషయాలను మెరుగైన విధానంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఏదైనా గోప్య విషయం మీకు తెలియవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లాభం ఉంటుంది
వృషభ రాశి (Taurus) - 2025 మే 15
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. పర్యాటక రంగంతో ముడిపడిన వారికి ధనలాభం ఉంటుంది. ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఉన్న సంబంధాలలో మెరుగుదల ఉంటుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. అవసరమైనవారికి మాత్రమే సలహా ఇవ్వండి. మిథున రాశి (Gemini) - 2025 మే 15
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ పనిలో ఎవరైనా స్నేహితుని సహాయం తీసుకోవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ఓపికతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయానికి కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. బాధ్యతల నుంచి పారిపోవద్దు. ఏకాగ్రతతో చేసిన పని లాభదాయకంగా ఉంటుంది. మీరు తక్కువ సమయంలో పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు.
కర్కాటక రాశి (Cancer) - 2025 మే 15
ఈ రోజు మీకు మంచి రోజు. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక విషయంలో అవసరం కన్నా నమ్మకం ఉంచుకోవడం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. డబ్బులు అప్పు ఇవ్వడానికి ముందు ఆలోచించండి. ఎవరైనా సన్నిహిత వ్యక్తి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శిస్తారు. భవిశ్యత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
సింహం రాశి (Leo) - 2025 మే 15
ఈ రోజు మీకు మెరుగ్గా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంతోషంగా ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు అకస్మాత్తుగా తిరిగి వస్తాయి. కుటుంబంలో మతపరమైన కార్యక్రమం చేయాలని ప్లాన్ చేస్తారు. మీ ప్రవర్తనలో కొన్ని మంచి మార్పులు ఉంటాయి. ఇతరులకు సహాయం చేయడానికి మీకు అవకాశం లభించవచ్చు.
కన్యా రాశి (Virgo) - 2025 మే 15
ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ ఉత్సాహం పెరుగుతుంది. సోదరుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. ఆగిపోయిన అన్ని పనులు పూర్తవుతాయి. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకు రేపు చదువులపై ఆసక్తి కొనసాగుతుంది. కెరీర్లో కొత్త అవకాశాలు లభిస్తాయి
తులా రాశి (Libra) - 2025 మే 15
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ దృష్టి పనిపైనే ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. కొన్ని కొత్త బాధ్యతలు చేపడతారు. చేపట్టిన పనులు విజయవంతంగా నిర్వహిస్తారు. సంతానం సహాయంతో పెద్ద పని పూర్తవుతుంది. తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభిస్తుంది. మీపై అసూయ చెందుతారు. కార్యాలయంలో ఏదైనా పని గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. వృశ్చికం రాశి (Scorpio) - 2025 మే 15
ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. మీరు ప్రారంభించే ఏ పనినైనా సమయానికి పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి విజయాలను అభినందించడం వల్ల మీ దాంపత్య జీవితంలో మధురత వస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి ఫలితం సాధిస్తారు. సంతానం నుంచి ఏదైనా శుభవార్త లభిస్తుంది. మీ ఊహాశక్తి మీ లక్ష్య సాధనలో సహాయపడుతుంది. లావాదేవీలకు ఈ రోజు మంచిది.
ధనుస్సు రాశి (Sagittarius) - 2025 మే 15
ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక విషయాలు ముందుకు సాగుతాయి. పనికి సంబంధించి కూడా ఏదైనా మంచి వార్తలు రావచ్చు. మీరు ఆలోచించిన అన్ని పనులు రేపు పూర్తవుతాయి. ఏదైనా కార్యక్రమంలో మీరు మీకు చాలా ప్రత్యేకంగా ఉండే వ్యక్తిని కలుసుకోవచ్చు. కలిసి పనిచేసేవారు సహాయపడతారు. వ్యాపారాన్ని మెరుగుపర్చుకుంటారు.
మకర రాశి (Capricorn) - 2025 మే 15
ఈ రోజు మీకు గడిచిన రోజు కన్నా బావుంటుంది. కుటుంబ సభ్యులతో ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. రేపు మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపుతారు. దీనివల్ల మీ సంబంధాలు మరింత మెరుగవుతాయి. స్నేహితులతో సరదా సమయం గడుపుతారు. మీరు భవిష్యత్ లో ప్రయోజనం పొందుతారు. ఏదైనా ప్రత్యేకమైన పనిలో మీరు విజయం సాధిస్తారు. వ్యాపారాన్ని పెంచడానికి రేపు మీ మనసులో కొత్త ఆలోచనలు రావచ్చు.
కుంభం రాశి (Aquarius) - 2025 మే 15
ఈ రోజంతా మీరు ఆనందంగా ఉంటారు. అదృష్టం కలిసొస్తుంది. వ్యాపారులకు లాభం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని పూర్తిచేయాలి అనుకుంటే పూర్తవుతుంది. ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటారు. ఏదైనా పెద్ద విజయం సాధిస్తారు.
మీన రాశి (Pisces) - 2025 మే 15
ఈ మీకు బావుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. పని ప్రదేశంలో అకస్మాత్తుగా పని ఒత్తిడి పెరగవచ్చు. పనిని పూర్తి చేయడానికి మీకు సరిపడా సమయం దొరకదు. రోజంతా బిజీగా ఉండటం వల్ల సాయంత్రానికి గందరగోళం ఉండొచ్చు. విద్యార్థులకు శుభఫలితాలున్నాయి.
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.