Tallest Ganesh Idol in the World : ఎత్తైన గణేష్ విగ్రహాల గురించి ఆలోచించినప్పుడు మనకు ఇండియా గుర్తు వస్తుంది. ఎందుకంటే వినాయకచవితి సమయాల్లో భారీ, ఎత్తైన విగ్రహాలు చూస్తాము. పైగా వినాయకుడిని ఇండియాలో బాగా పూజిస్తారు కాబట్టి.. ఎత్తైన విగ్రహం అంటే ఇండియాలో ఉంది అనుకుంటాము. కానీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహం ఇండియాలో లేదని మీకు తెలుసా? అవును అత్యంత ఎత్తైన వినాయకుడి విగ్రహం  థాయిలాండ్‌లో ఉంది. చాచెంగ్సావోలో 128 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కాంస్య విగ్రహం ఉంది. ఈ ఎత్తైన విగ్రహం భక్తులను, సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ విగ్రహానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement


టూరిస్ట్ ప్లేస్​గా


ప్రసిద్ధ ఖ్లాంగ్ ఖువాన్ గణేష్ అంతర్జాతీయ పార్క్ (Khlong Khuean Ganesh International Park) వద్ద ఉన్న ఈ అద్భుతమైన కాంస్య విగ్రహం పచ్చదనం, ప్రశాంతమైన నీటి వనరులతో నిండి ఉంది. ఈ ప్రదేశం భక్తులకు, యాత్రికులకు కూడా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. స్థానికంగా దీనిని ఫ్రా ఫికానేట్ అని పిలుస్తారు. ఇది టూరిస్ట్ ప్లేస్​గా మారి సంవత్సరం పొడవునా విజిట్ చేసేందుకు అందుబాటులో ఉంటుంది. బ్యాంకాక్‌ను సందర్శించే పర్యాటకులు తరచుగా చాచెంగ్సావోకు వెళ్తూ ఉంటారు. ఇది వినాయకుడిపై నమ్మకాన్ని పెంచుతూ.. పర్యాటకంతో మిళితం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.


39 మీటర్ల కాంస్యంతో..






39 మీటర్ల ఎత్తులో.. 14 అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న ఈ గణేష్ విగ్రహం ఇంజనీరింగ్, కళా నైపుణ్యానికి ఒక అద్భుతంగా చెప్తారు. 2012లో దీనిని పూర్తిగా కాంస్యంతో తయారు చేసి నిర్మించారు. ఇది ప్రపంచంలోనే వినాయకుడి భారీ విగ్రహంగా చెప్తారు. మెరిసే కాంస్య విగ్రహం ఎండలో సూర్యరశ్మిని ప్రతిబింబిస్తుంది. దీనివల్ల విగ్రహాన్ని దూరం చూస్తే చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీనిని నిర్మించేందుకు ఎన్నో ఏళ్లు ప్రణాళికలు రూపొందించి.. ఆధునిక నిర్మాణంతో, కాలాతీత ఆధ్యాత్మిక భక్తికి చిహ్నంగా దీనిని నిర్మించారు. వినాయకుడి కిరీటం, ఆభరణాలు, భంగిమలపై ఉన్న వివరాలు సాంప్రదాయ హిందూ చిహ్నాలను ప్రతిబింబిస్తాయి. ఇవి సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తాయి.


సరిహద్దులు లేని భక్తి


థాయిలాండ్ ప్రధానంగా బౌద్ధమతంతో పాటు.. హిందూ దేవతలను గౌరవించే సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. వినాయకుడిని విఘ్నాలను తొలగించేవాడిగా, కళలు, జ్ఞానాన్ని ఇచ్చేవాడిగా కొలుస్తారు. అందుకే థాయిలాండ్ ప్రజలు వినాయకుడికి ప్రత్యేక స్థానాన్ని కలిపించారు. ఖ్లాంగ్ ఖువాన్‌లో వివిధ మతాలకు చెందిన భక్తులు.. వినాయకుడికి బంతి పువ్వు దండలు, ధూపం సమర్పించి ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ హిందూ సంప్రదాయాలను థాయ్ బౌద్ధ ఆచారాలతో మిళితం చేస్తారు. పండుగ రోజుల్లో.. థాయ్ సన్యాసుల మంత్రాలు ఆ ప్రాంతంలో ప్రతిధ్వనిస్తాయి. ఇవి హిందూ భక్తి గీతాలకు చాలా దగ్గరగా ఉంటాయి.


గణేష్ చతుర్థి సమయంలో భారతదేశంలో కనిపించే అనేక గణేష్ విగ్రహాల మాదిరిగా కాకుండా.. ఈ విగ్రహం శాశ్వతమైన ఆధ్యాత్మిక మైలురాయిగా నిలుస్తుంది. భౌగోళిక సరిహద్దులను దాటి.. భాగస్వామ్య భక్తి ద్వారా ప్రజలను ఏకం చేస్తుంది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులను, ఆధ్యాత్మిక అన్వేషకులను, పర్యాటకులను ఆకర్షిస్తుంది. అందుకే దీనిని చూడటానికి వస్తున్నారు.