Rahu-Ketu Planet: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువు ఒక నీడ గ్రహాలు. ఇవి భౌతికంగా కనిపించవు. పురాణాల ప్రకారం, సముద్ర మథనం సమయంలో దేవతలకు, రాక్షసులకు అమృతం పంచుతున్నప్పుడు ఒక రాక్షసుడు మోసపూరితంగా దేవతల్లో కలసిపోయి అమృతం సేవించాడు. అనంతరం శ్రీ విష్ణువు తలను మొండెం నుంచి వేరు చేశాడు. తల భాగాన్ని రాహువు అని, మొండెం భాగాన్ని కేతువు అని పిలుస్తారు. అప్పటి నుంచి రాహు-కేతువులు రెండు నీడ గ్రహాలుగా మారాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది.
| రాహు-కేతువుల అశుభ ప్రభావాలు |
| జాతకంలో రాహువు స్థానం అశుభంగా ఉంటే, వ్యక్తి మనస్సు అస్థిరంగా, ఆందోళనంగా ఉంటుంది, లేనిపోని భ్రమలకు గురవుతుంటారు |
| రాహువు భోగాలకు, మాయాజాలానికి చిహ్నం. దీని అశుభ దృష్టితో వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించబడతాడు. |
| రాహు-కేతువుల అశుభ స్థితి కారణంగా, వ్యక్తి చెడు వ్యక్తులతో సంబంధం కలిగి ఉండవచ్చు. దీనితో పాటు సమాజంలో గౌరవం తగ్గుతుంది. |
| జాతకంలో కేతువు అశుభ స్థితిలో ఉంటే, వ్యక్తి సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. సంబంధాలలో దూరం పెరగడంతో పాటు లేనిపోని వివాదాల్లో చిక్కుకుంటారు |
| కేతువు మోక్షం ఆధ్యాత్మికతకు కారకుడు, కానీ అశుభ స్థితిలో సంచరించినప్పుడు ఆ వ్యక్తి తన మార్గం నుంచి కూడా తనకు తెలియకుండానే తప్పుకుంటారు |
| రాహు-కేతువుల అశుభ స్థితి కారణంగా, వ్యక్తి ధన నష్టంతో పాటు పనిలో వైఫల్యాన్ని కూడా ఎదుర్కోవలసి రావచ్చు. |
రాహు-కేతువుల గురించి పురాణాలలో కూడా ప్రస్తావన
- పురాణాలలో రాహు-కేతువులను గ్రహనికి ప్రధాన కారణాలుగా భావిస్తారు. సూర్యుడు చంద్రునిపై వాటి నీడ పడినప్పుడు సూర్య , చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి.
- గరుడ పురాణం , స్కంద పురాణంలో వాటి పూజ శాంతి విధానం గురించి వివరించి ఉంటుంది
- రాహు-కేతువుల ప్రభావం నుంచి విముక్తి పొందడానికి మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలని చెబుతారు
మహా మృత్యుంజయ మంత్రం: "ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||"
రాహువుకు సంబంధించిన పరిహారాలురాహువు చెడు సమయం మీకు నడుస్తున్నప్పుడు అది మిమ్మల్ని భౌతిక వస్తువుల వైపు ఆకర్షిస్తుంది. ఇందులో పేరు, డబ్బు, కోరిక, లోభం , భ్రమ మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆవహిస్తాయి. రాహువును సమతుల్యం చేయడానికి కొబ్బరికాయను దానం చేయండి. ఓం రాం రహవే నమః మంత్రాన్ని జపించాలి.
కేతువుకు సంబంధించిన పరిహారాలుకేతువు నష్టానికి కారకుడు అవుతాడు. కేతువు చెడు స్థానంలో సంచరించినప్పుడు... పదేపదే పాత విషయాల గురించి పశ్చాత్తాపానికి గురిచేస్తాడు. ఇది మిమ్మల్ని లోపలి నుంచి బలహీనపరుస్తుంది. కేతువును సమతుల్యం చేయడానికి మౌన వ్రతం, ధ్యానం, రుద్రాక్ష ధరించడం మంచి ఫలితాన్నిస్తుంది. దీనితో పాటు ఓం కేతవే నమః మంత్రాన్ని జపించండి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది. దీనిని ఎంతవరకూ విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం. వీటిని పరిగణలోకి తీసుకునేముందు,అమలు చేసేముందు మీకు నమ్మకమైన ఆధ్యాత్మికవేత్తల సలహాలు కూడా స్వీకరించండి.