Covid-19 Affects Veins : కరోనా మహమ్మారి వెళ్లిపోయినా దాని ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ వైరస్ కేవలం ఊపిరితిత్తులు,  రోగనిరోధక శక్తిని మాత్రమే ఎఫెక్ట్ చేయలేదు.. సిరలపై కూడా తన నెగిటివ్ ప్రభావం చూపించదని చెప్తున్నారు నిపుణులు. దీనివల్ల గుండె ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిందని చెప్తున్నారు. తాజాగా యూరోపియన్ హార్ట్ జర్నల్లో పరిశోధన సమయంలో ఆశ్చర్యకరమైన గుర్తించారు. అధ్యయనంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, యూరప్​తో సహా 16 దేశాలకు చెందిన సుమారుగా 2400 మందిని పాల్గొన్నారు. వీరిలో కరోనా సోకిన వారి సిరలు సాధారణం కంటే ఎక్కువ వయస్సు పెరిగాయని తేలింది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం పెరిగిందని గుర్తించారు.

కరోనా సోకిన వారి సిరలపై ప్రభావం

ఈ పరిశోధనలో కోవిడ్-19 సోకిన వారి ధమనుల్లో వశ్యత తగ్గినట్లు గుర్తించారు. అంటే సిరలు ముందే వృద్ధాప్యం చెందాయని.. దీనివల్ల రక్త ప్రసరణ ప్రభావితమవుతుందని తెలిపారు. గుండెపై అదనపు ఒత్తిడి పడిందని.. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగినవారిలో గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు వంటి వాటి ప్రమాదం పెరిగిందని తెలుసుకున్నారు.

2400 మందిపై పరిశోధన 

పరిశోధనలో పాల్గొన్న 2400 మందిలో కరోనా నుంచి కోలుకున్న వారు కూడా ఉన్నారు. వీరిలో 40% మంది సిరలు వాస్తవ వయస్సు కంటే 5 సంవత్సరాలు ఎక్కువ వయస్సు కలిగి ఉన్నట్లు గుర్తించారు. కోవిడ్-19 ప్రభావం కేవలం ఇన్ఫెక్షన్ సమయంలోనే కాకుండా, రికవరీ తర్వాత కూడా శరీరంలో ఉంటుందని సూచిస్తుంది. నిపుణులు వైరస్ సిరలలో వాపు, నష్టం కలిగించవచ్చు. దీనివల్ల సిరల స్థితిస్థాపకత కోల్పోయి గుండెపై ఒత్తిడి పెరిగిందని తెలిపారు.

గుండె, సిరలను ఎలా కాపాడుకోవాలంటే..

కరోనా తర్వాత గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నా.. సిరలను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు నిపుణులు. 

  • సమతుల్య ఆహారం : పండ్లు, కూరగాయలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, పీచు పదార్థాలు  తీసుకోవాలి. ఇవి సిరలు కండీషన్ మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
  • వ్యాయామం : రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం చేయాలి. యోగా కూడా మంచిదే. ఇవి సిరల స్థితిస్థాపకతను కాపాడటానికి సహాయం చేస్తాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
  • రక్త పోటు, చక్కెర : అధిక రక్తపోటు, మధుమేహం సమస్యను రెట్టింపు చేసి ప్రమాదకరంగా మార్చుతాయి కాబట్టి.. వాటిని అదుపులో ఉంచుకోండి. వైద్యులు సూచించిన నియమాలు పాటిస్తూ మందులు ఉపయోగించండి. అప్పుడు పరిస్థితి విషమించకుండా ఉంటుంది.
  • ఒత్తిడి : ఒత్తిడి, ఆందోళన గుండె ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టడంతో పాటు.. సిరలపై ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ధ్యానం, మెడిటేషన్ లేదా తేలికపాటి వ్యాయామం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోండి. డీప్ బ్రీతింగ్ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.
  • ఆరోగ్య పరీక్షలు : కరోనా ఎఫెక్ట్ పడినవారు కచ్చితంగా సిరలు, గుండె ఆరోగ్యాన్ని తెలుసుకోవడం కోసం టెస్ట్​లు చేయించుకోవాలి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.