లలు నిజమవుతాయా? ఏమో చెప్పలేం. కానీ, ఈ వ్యక్తి విషయంలో మాత్రం అది నిజమైంది. ఓ రోజు అతడికి కొన్ని నెంబర్లు కలలోకి వచ్చాయి. వాటిని అతడు లక్కీ నెంబర్స్ అనుకున్నాడు. ఆ తర్వాతి రోజు అతడు అవే నెంబర్లతో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. చివరికి.. ఆ నెంబర్లు అతడిని కోటీశ్వరుడిని చేశాయి. అతడి లాటరీ టికెట్‌కు రూ.1.97 కోట్లు వచ్చాయ్. 


అమెరికాలోని వర్జినీయాకు చెందిన అలోంజో కొలేమ్యాన్ తన ‘కల’ను సాకారం చేసుకున్నాడు. కలలోకి వచ్చిన నెంబర్లతోనే లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అక్కడ ఎంపిక చేసుకొనే నెంబర్లతో కూడా లాటరీ కొట్టవచ్చు. దీంతో, అతడికి కలలో కనిపించిన 13-14-15-16-17-18 వరుస నెంబర్లతో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. ఫలితాల రోజు తన టికెట్ మీద సెలక్ట్ చేసుకున్న ఒక్కో నెంబరు స్క్రీన్ మీద కనిపిస్తుంటే.. మనోడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. 


ఇంకా తాను కలలోనే ఉన్నాడని అనుకున్నాడో ఏమో.. గట్టిగా గిల్లుకుని మరీ చూశాడు. అది నిజమని తెలియగానే అతడి ఆనందానికి అవధుల్లేవు. రూ.1.97 కోట్లయితే గెలుచుకున్నాడు. కానీ, ఒకే ఒక్క నెంబర్ మిస్ కావడం వల్ల మరో జాక్‌పాట్ మిస్ అయ్యాడు. ఆ తర్వాతి నెంబర్‌ను 19 అని పేర్కోవడంతో బోనస్ బాల్ కోల్పోయాడు. ఫలితంగా అతడు మరో రూ.1.97 కోట్లను కోల్పోయాడు. అయితేనేం.. లాటరీ తగలడమంటేనే లక్కీ. పైగా కలలలో కనిపించిన నెంబర్లతో లాటరీ కొట్టడమంటే అద్భుతం. ఈ డబ్బుతో అతడు తన కలలన్నీ సాకారం చేసుకోవచ్చు. కాబట్టి, కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి. 


అయితే, లక్ ఒక్కసారి ఆలస్యంగా కూడా వరించవచ్చు. ఇందుకు అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఈ వ్యక్తి ఘటనే నిదర్శనం. అతడికి 30 ఏళ్లు ఉన్నప్పటి నుంచి.. అంటే 1991 నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. లాటరీ అనేది పూర్తిగా అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. 30 ఏళ్లుగా అతడి ఓపిక, మెుండిగా లాటరీ టికెట్లనే నమ్ముకునే ఉన్నాడు. ఇటీవల కూడా అదే ఆశతో ఎప్పటిలాగే.. అదే నంబర్ సెట్ లో లాటరీ టికెట్ కొన్నాడు. కానీ ఏం జరుగుతుందిలేననుకున్నాడు. అదే అతడికి అదృష్టమైంది.  


30 ఏళ్లుగా ఓపిగ్గా చూసిన.. అతడి కల నెరవేరింది.  ఇటీవల ప్రకటించిన లాటరీ నంబర్లలో అతడి నంబర్ ఉంది. గెలుచుకుంది ఎంత అనుకుంటున్నారా?  అతను దశాబ్దాలుగా ఎదురు చూసిన దానికి ఫలితం దక్కింది. అతను గెలుచుకున్న మొత్తం డబ్బు ఎంతో తెలుసా? 18.41 మిలియన్ డాలర్లు  అంటే దాదాపు రూ.రూ.135 కోట్లు.


Also Read: తెలుగు ప్రజలు ఇతర రాష్ట్రాల లాటరీ టికెట్లను కొనొచ్చా? ఏయే రాష్ట్రాలు అనుమతిస్తున్నాయి?




'నేను 1991 నుంచి ఒకే నంబర్ సెట్ కోసం టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నాను. కానీ ఇప్పటి వరకు.. గెలవలేను. నేను కూడా అనేకసార్లు నంబర్‌ని మార్చడం గురించి ఆలోచించాను. కానీ అదే నంబర్ పై నమ్మకంతో, మెుండిగా ఉన్నాను. ఇప్పుడు అదే నాకు విజయం తెచ్చిపెట్టింది.' అని గెలిచిన వ్యక్తి చెప్పుకొన్నాడు. 18 మిలియన్ డాలర్ల మొత్తంలో, ఆ వ్యక్తి రూ.86 కోట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబానికి కొంత మొత్తాన్ని ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కొంత మొత్తాన్ని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ వార్త వైరల్ అవుతోంది.



Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?