మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలారు. ఇప్పటికీ హీరోలుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారి సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు చేసే హడావిడి మాములుగా ఉండదు. ఇప్పటికే వీరిద్దరూ తమ సినిమాలతో చాలా సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నెంబర్ 150', బాలయ్య నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలు కూడా ఒకరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ పోటీ పడడానికి రెడీ అవుతున్నారు.
చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో 'గాడ్ ఫాదర్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో వచ్చిన 'లూసిఫర్' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార, సత్యదేవ్ లాంటి తారలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అలానే సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో చిరు ఓల్డ్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఇదే సందర్భంలో దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాతో పోటీగా బాలయ్య సినిమా రాబోతుందట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. మొన్నామధ్య విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాను దసరా సీజన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుంది. అదే గనుక జరిగితే మరోసారి చిరు వర్సెస్ బాలయ్య పోటీని చూసే ఛాన్స్ వస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు దసరా సీజన్ లో మరిన్ని సినిమాలు రాబోతున్నాయి.
Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Also Read : గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్