చైనాలోని ఒక ప్రాంతంలో గోడలపై కొన్ని పోస్టర్లు వెలిశాయి. వాటిలో ఇల్లు కొనుక్కోవాలని కోరుకుంటున్నవారు డౌన్ పేమెంట్‌గా డబ్బుకు బదులు పుచ్చకాయలు, వెల్లుల్లి పాయలు, గోధుమలు... ఇలా పండించిన ఉత్పత్తులు ఇచ్చి కొనుక్కోవచ్చని ఆ పోస్టర్లలో రాసి ఉంది. అది ముఖ్యంగా రైతుల కోసం ఇచ్చిన ఆఫర్‌గా చెప్పుకుంటున్నారు ప్రజలు. అయిదు వేల పుచ్చకాయలు ఇస్తే లక్ష యున్‌లు డబ్బులు ఇవ్వడంతో సమానం.అంటే కిలో పుచ్చకాయకు 20 యున్‌లు ఇచ్చినట్టు.పుచ్చకాయలు పండించే రైతులు ఇలా వాటిని ఇచ్చి ఇల్లు కొనుక్కునేందుకు ముందుకు వస్తున్నారు. 


ఇలా ఎందుకు?
చైనాలోని కొన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్ర మాంద్యంలో ఉంది. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ఇళ్లు అమ్మాలంటే చాలా కష్టం. అందుకే రైతులను ఆకర్షించేందుకు పంటలు కూడా డౌన్ పేమెంట్‌గా తీసుకుంటామని ప్రకటించారు వ్యాపారులు. వస్తు మార్పిడి ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తారన్న మాట. వెల్లుల్లి పండించే వాళ్లకు కిలోకు ఒక రేటు నిర్ణయించారు, అలాగే గోధుమలు పండించేవాళ్లకు కిలోకు ఒక ధర నిర్ణయించారు. ఇంటి ధరకు తగ్గ ఉత్పత్తులను ఇచ్చి ఇల్లు కొనుక్కోవచ్చు. ఈ ఆఫర్ చాలా తక్కువ కాలానికే పరిమితం చేశారు. చాలా మంది రైతులు ఈ ఆఫర్లో భాగంగా ఇళ్లు కొనేందుకు ముందుకు వచ్చార. 


ఆ పంటలను ఏం చేస్తాయి?
రైతుల నుంచి తీసుకున్న పుచ్చకాయలు, వెల్లుల్లి, గోధుమలు వంటి పంటలను రియల్ ఎస్టేట్ సంస్థలు ఏం చేసుకుంటాయి అనే సందేహం వస్తుంది కదా? ఏముంది వాటిని దళారులకు అప్పటించి అమ్ముకుంటాయి. రైతుల దగ్గర కిలో రెండు యున్‌లకు కొని నాలుగు యున్‌‌లకు అమ్ముకుంటారు. దీని వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభమే. అంటే మామూలు ధర కన్నా ఎక్కవ ధరకే ఇల్లు అమ్మినట్టు. రైతులకు కూడా పంటను మోసుకెళ్లి గంటలు గంటలు కష్టపడి అమ్మాల్సిన అవసరం లేకుండా ఒక్కసారే అమ్మేసుకోవచ్చు, అలాగే ఇల్లు కూడా సొంతం చేసుకోవచ్చు. ఇదే కారణంతో ఈ ఐడియాకి రైతులు కూడా ఆకర్షితులవుతున్నారు. 


Also read: ఈ చిత్రం ద్వారా మీరు మీ జీవిత భాగస్వామిని మోసం చేసే వారో కాదో చెప్పేయచ్చు


Also read: ఎత్తుగా ఉన్నవాళ్లకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువట, అదే ఎత్తు తక్కువగా ఉంటే అవి తప్పవట


Also read: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే