Optical Illusion: ఎవరూ పుట్టుకతో మోసగాళ్లు కాదు, పరిస్థితులను బట్టి వారి బుద్ధి, ఆలోచనా మారుతుంది. మీరు మోసగాళ్లో కాదో ఈ చిన్న వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. నిపుణులు తయారుచేసిన ఉచిత వ్యక్తిత్వ పరీక్ష ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. దీన్ని బట్టి మీరు ఎంత వరకు మీ జీవితభాగస్వామిని మోసం చేసే అవకాశం ఉందో అంచనా వేయచ్చు. మీకు ఇక్కడ ఇచ్చిన బొమ్మను చూగానే మొదట ఏం కనిపించిందో మీ మెదడు దేనిని మొదట గుర్తు పట్టిందో చెప్పండి. దాన్ని మీరు ఎంతటి మోసగాళ్లో చెప్పేయచ్చు.
పక్షులు
బొమ్మలో మీ మెదడు మొదట పక్షులను పసిగట్టిందా? అయితే మీ బంధంలో మీరు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉండాలని కోరుకుంటారు. అయితే మీరు విధిని నమ్ముతారు. దాన్ని ప్రకారమే అన్నీ జరుగుతాయని అనుకుంటారు. మీరు ఇప్పటికే ఒక భాగస్వామిని ఎంపిక చేసుకుని ఉంటే వారే మీరు సరైన వారని చెప్పవచ్చు.
చెట్లు
బొమ్మలో మీకు మొదట చెట్లు కనిపిస్తే మీరు ప్రేమలో లేదా జీవిత భాగస్వామిలో చాలా నిజాయితీగా ఉంటారని అర్థం. అయితే ఒక్కోసారి మీకు తగ్గ ప్రేమ జీవితం లేదా, వ్యక్తులు తారసపడొచ్చు. అలాంటప్పుడు మోసానికి గురికావడం కంటే మీకు మీరే విడిపోవడం మంచిది.
గుడిసె
మీకు ఈ చిత్రంలో మొదట గుడిసె కనిపిస్తే మీరు మోసగాళ్లనే అర్థం. మీ జీవిత భాగస్వామిని లేదా, ప్రేమ వ్యవహారాల్లో మీరే మోసం చేస్తారు. మీరు ఎంత తెలివి మోసం చేస్తున్నప్పటికీ తప్పకుండా చిక్కుల్లో పడే అవకాశం ఉంది.
ఎంత వరకు నమ్మవచ్చు?
ఆప్టికల్ ఇల్యూషన్ కేవలం కాసేపు టైమ్ పాస్ వ్యవహారాలు, వీటినెలా నమ్ముతాం అని వాదించే వాళ్లున్నారు. అది వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలు. నమ్మమని కానీ, నమ్మవద్దని కానీ మేం చెప్పడం లేదు. మా దృష్టికి వచ్చిన ఆసక్తికరమైన కథనాలను అందించడమే మా పని. దెయ్యాలు ఉన్నాయని నమ్మేవాళ్లు ఉన్నారు, లేరని వాదించే వాళ్లూ ఉన్నారు. నమ్మకం అనేది మనుషుల వ్యక్తిగత అభిప్రాయాలు. వాటిని మార్చే ఉద్దేశం, తప్పని నిరూపించే అవసరం మాకు లేదు.
ఆప్టికల్ ఇల్యూషన్ అంటే...
వినోదాత్మకంగా చూసకుంటే నిజంగానే ఇవి కాసేపు మెదడుకు మేత అనే చెప్పాలి. కళ్ల ముందే అంతా కనిపిస్తున్నా కనిపించని రహస్యాలను దాచుకోవడమే ఆప్టికల్ ఇల్యూషన్.
Also read: ఎత్తుగా ఉన్నవాళ్లకి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువట, అదే ఎత్తు తక్కువగా ఉంటే అవి తప్పవట
Also read: వెంట్రుకలు పీక్కుంటున్నారా? అది అలవాటు కాదు రోగం, ఆ రోగానికి కారణాలు ఇవే