శిశిరం తరువాత వచ్చే వసంతకాలంలోని తొలి పండుగ ఉగాది (Ugadi 2020). ఉగాది రోజే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఆ రోజున ఉదయం లేవడంతోనే ఉగాది శుభాకాంక్షలను బంధు మిత్రులకు పంపించడం మొదలుపెడతారు. అలా పంపించేందుకు కొన్ని చక్కటి సందేశాలు ఇవిగో...

1. తీపి, చేదు కలిసిందే జీవితం
కష్టం, సుఖం తెలిసిందే జీవితం
మీ జీవితంలో ఈ ఉగాది 
ఆనందోత్సహాలు పూయిస్తుందని 
మనస్పూర్తిగా కోరుకుంటున్నా. 
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

2. మామిడి పువ్వు పూతకొచ్చింది
కోయిల గొంతుకు కూత వచ్చింది
వేప కొమ్మకు పూవు మొలిచింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ రానే వచ్చింది
మీకు మీ కుటుంబసభ్యులకు

శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

3. కష్టాలెన్నైయినా రానీయండి
సవాళ్లెన్నైనా ఎదురవనీయండి
కలిసి నిలుద్దాం, గెలుద్దాం
ఈ సంవత్సరం మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ...
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

4. మధురమైన ప్రతి క్షణం 
నిలుస్తుంది జీవితాంతం 
ఈ కొత్త ఏడాది 
అలాంటి క్షణాలనెన్నో 
మీకు అందించాలని కోరుకుంటున్నాను.
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

5. కాలం పరుగులో మరో మైలురాయి 
ఈ కొత్త ఏడాది...
ఈ ఏడాదంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
 
6. ఈ ఉగాది మీకు
ఉప్పొంగే ఉత్సాహాలను
చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను
అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

7. జీవితం సకల అనుభూతలు సమ్మిశ్రమం
అదే ఉగాది పండుగ సందేశం.
మీకు మీ కుటుంబసభ్యలకు 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 

8. చీకటిని తరిమే ఉపోదయంలా
చిగురాలకు ఊయలలో నవరాగాల కోయిలలా
అడుగు పెడుతున్న ఉగాదికి స్వాగతం.
ఈ ఏడాది మీకంతా మంచే జరగాలని కోరుతూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

9. లేత మామిడి ఆకుల తోరణాలు
శ్రావ్యమైన కోయిల రాగాలు
అందమైన ముగ్గులు
కొత్త వస్త్రాలతో కళకళలాడిపోతున్న పిల్లలు
ఉగాది పండుగ సంబరాలు ఎన్నో.
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

10. మన సాంప్రదాయాలను గుర్తుచేస్తూ వచ్చిన ఈ ఉగాది పండు అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని కోరుకుంటూ... 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

11. కొత్త ఆశలు
కొత్త ఆశయాలు
కొత్త ఆలోచనలతో
ఈ ఉగాది నుంచి 
మీ జీవితం ఆనందమయం కావాలని కోరుకుంటూ 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

12.  ఈ కొత్త ఏడాది మీ జీవితంలో 
విజయాలను, సంపదను, సంతృప్తిని 
సమృద్దిగా తీసుకురావాలని ఆశిస్తూ 
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Also read: షడ్రుచులను అందించే ఉగాది పచ్చడి తయారీ విధానం ఇలా

Also read: ఉగాదికి ప్రసాదం పులిహోర ఇలా చేసుకుంటే టేస్టు అదిరిపోవడం ఖాయం