Jaggery Tea: చలికాలం వచ్చేసింది. ఈ చల్లని గాలులు శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే, శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచే ఆహారాలను తినడం చాలా ముఖ్యం. చలికాలంలో వేడివేడి టీ తాగితే చాలా సాంత్వనగా ఉంటుంది. కానీ ఆ టీ లో పంచదారకు బదులు బెల్లాన్ని వేసుకునేందుకు ప్రయత్నించండి. దీని వల్ల చలికాలంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. చలి తక్కువగా వేస్తుంది. అలాగే మరికొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి.


బెల్లంలో ఇనుము అధికంగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్, విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, జ్వరం వంటిది దరిచేరకుండా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా బెల్లం టీ మంచి ఎంపిక. ఇది జీవక్రియలను వేగవంతం చేసి బరువు త్వరగా తగ్గేలా చేస్తుంది. మహిళలు ఖచ్చితంగా బెల్లం టీ ని తాగాలి. ఇలా తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే చాలా సమస్యలు తగ్గుతాయి. కడుపునొప్పి రావడం, తిమ్మిర్లు పట్టడం వంటివి అదుపులో ఉంటాయి.


వ్యర్థాలను తొలగించే గుణం ఉంటుంది. కాబట్టి రోజూ బెల్లం టీ తాగితే పొట్ట, పేగులు, ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఈ టీ తాగే వారిలో మలబద్ధకం వంటి సమస్యలు కూడా రావు. ఇది జీర్ణక్రియకు మంచిది. అజీర్తి వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారు బెల్లం టీ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది జీవక్రియలను మెరుగుపరుస్తుంది. గ్యాస్ సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. పొట్ట ఉబ్బరం సమస్యను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలు బెల్లం టీ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ ఉదయం ఈ టీని తాగడం చాలా అవసరం. బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఎముకలను ఇవి గట్టిగా మారుస్తాయి. బెల్లం అనేది శుద్ధి చేయని చక్కెరగా చెబుతారు.రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రోజుకు చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయి. 


Also read: పొట్టిగా ఉండే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువా?


Also  read: ఎక్కువ స్క్రీన్ టైమ్ మీ పిల్లల ఆలోచనా శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?






గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.