తల్లికో, తండ్రికో లేక తాతకో పిప్పి పళ్ల సమస్య ఉంటే భవిష్యత్తులో ఆమె పిల్లలకు లేదా మనవలకు కూడా వచ్చే అవకాశం ఉంది. కుటుంబ చరిత్రలో పిప్పిపళ్లు ఉంటే చాలు వారసత్వంగా అది ఎవరికైనా రావచ్చు. చైనాలో చేసిన కొత్త అధ్యయనం ఇదే విషయాన్ని తేల్చింది. ఇంతవరకు మధుమేహం, క్యాన్సర్ వంటివే వారసత్వంగా వస్తాయనుకుంటే పిప్పి పళ్ల వంటి సమస్యలు జన్యుపరంగా వస్తాయని కొత్తగా తేలింది.అమెరికన్ డెంటల్ అసోసియేషన్ వారు చేసిన పరిశోధనలో దంతక్షయం కేసుల్లో 60 శాతం వారసత్వంగా వచ్చినవేనని తేలింది. నోటి క్యాన్సర్, చిగుళ్ల వ్యాధి, వంకరటింకరగా వచ్చే పళ్లు, ఎత్తు పళ్లు... ఇవన్నీ కూడా వారసత్వంగా సంక్రమించవచ్చని చెప్పారు పరిశోధకులు. 


ఈ కొత్త అధ్యయనాన్ని బట్టి కుటుంబచరిత్రలో ఎవరికైనా పిప్పి పళ్ల సమస్య తరువాత తరాలు వారు జాగ్రత్తగా ఉండాలి. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిప్పి పళ్లు రాకుండా అడ్డుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే నోటి పరిశుభ్రతను పాటించాలి. అదనపు శ్రద్ధ తీసుకుంటే వారసత్వంగా వచ్చే దంత క్షయాన్ని అడ్డుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు. ప్రతి రోజు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం చాలా అవసరం. అలాగే రాత్రి పూట తీపి పదార్థాలు తినకూడదు. దంతక్షయం వచ్చే అవకాశం ఉన్నవారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. 


చైనీస్ అకాడమీ  ఆఫ్ సైన్సెస్ చేసిన మరొక అధ్యయనంలో నోటిని శుభ్రం చేసుకోకుండా వదిలేస్తే రెండు రోజుల్లోపు నోటిలో ఉండే మంచి బ్యాక్టిరియా తగ్గిపోతుంది. అలాగే నోటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ రసాయనాలు కూడా తగ్గిపోతాయి. అంతేకాదు నోటి పరిశుభ్రత లేకపోతే త్వరగా పళ్లు రాలిపోయే ప్రమాదం కూడా ఉంది. 


పిప్పి పళ్లు వచ్చాక జాగ్రత్త పడే కన్నా రాకముందే జాగ్రత్త పడడం ఉత్తమం. మరీ చల్లటి లేదా మరీ వేడి పదార్థాలు తినడకూడదు. అప్పుడప్పుడు లవంగాలు నోటిలో పెట్టుకుని నములుతూ ఉండాలి. మిరియాల పొడి, ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేస్తూ ఉండాలి. ఏడాదికోసారైనా పంటి డాక్టర్ వద్దకు వెళ్లి చెకప్ చేయించుకోవాలి. 


Also read: బరువు తగ్గేందుకు లిక్విడ్ డైట్ ఫాలో అవుతున్నారా? ముందుగా వాటి దుష్ప్రభావాలేంటో తెలుసుకోండి


Also read: క్యాన్సర్ నుంచి తప్పించుకునేందుకు ఏంజెలీనా జోలీ ఆ పని చేసింది, కానీ అందరూ అలా చేయలేరు


Also read: హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే, తింటే డాక్టర్ అవసరం తగ్గుతుంది