ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసింది. మరణించడానికి 14 రోజుల ముందు నుంచి ఆయన లిక్విడ్ డైట్ పాటిస్తున్నారు. బరువు తగ్గించుకుని సన్నగా మారేందుకు ఈ డైట్ ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. ఈ డైట్ పాటించడానికి కొన్ని రోజుల ముందు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. అందులో తాను సన్నగా ఉన్నప్పటి ఫోటోను షేర్ చేసి, జూలై కల్లా నేను ఇలా అయిపోవాలి క్యాప్షన్ పెట్టారు. దీన్ని బట్టి చూస్తే బరువు తగ్గడాన్ని ఆయన సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది. అయితే ఈ లిక్విడ్ డైట్ వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని చెప్పే ఆధారల్లేవు. కానీ తినే ఆహారం కూడా అనారోగ్య పరిస్థితులకు దారితీసే పద్ధతులపై ప్రభావం చూపిస్తుందన్నది మాత్రం నిజం. ఈ లిక్విడ్ డైట్ పాటించడం మంచిదా కాదా అన్నది ముందుగా తెలుసుకోవాలి. 


త్వరగా బరువు తగ్గేందుకు...
త్వరగా బరువు తగ్గాలని భావించేవాళ్లు లిక్విడ్ డైట్ బాట పడతారు. ఇందులో ఘనాహారం ఆపేస్తారు. రకరకాల పండ్ల రసాలు, షేక్స్, సూప్స్, కూరగాయల రసాలు మాత్రమే తాగుతారు. దీని వల్ల తక్కువ కేలరీలు శరీరానికి అందుతాయి, తద్వారా బరువు తగ్గుతారు. అయితే ఈ రసాలు చర్మకాంతిని కూడా పెంచుతాయని నమ్ముతారు.


నష్టాలెన్నో
పండ్లు, కూరగాయలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కానీ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉండవు. శరీరానికి ఈ రెండూ చాలా అవసరం. గుండెకు ఇంకా అవసరం. ఫైబర్ కూడా పుష్కలంగా అందే అవకాశం తక్కువ. లిక్విడ్ డైట్ తీసుకునేవాళ్లు త్వరగా నీరసించి పోతారు. శక్తిహీనంగా అయిపోతారు. ఇలా దీర్ఘకాలం కొనసాగితే చాలా ప్రమాదమని చెబుతున్నారు వైద్యులు. ఇనుము అందక రక్తహీనత ఏర్పడవచ్చు. తలనొప్పి, విపరీతమైన అలసట వేధిస్తాయి. ఇది తట్టుకోలేని స్థాయిలో కలుగుతాయి. శరీరంలో ప్రధాన అవయవాలపై కూడా ప్రభావం పడుతుంది. అవి అసాధారణంగా పనిచేయడం మొదలుపెడతాయి. సమతులాహారం తీసుకుంటూనే ఆరోగ్యంగా బరువు తగ్గే పద్ధతులను అనుసరించాని సలహా ఇస్తున్నారు వైద్యులు. వ్యాయామంతోనే సాధించాలని, డైట్ లు పాటించడం ఆరోగ్యపరంగా నష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి డైట్ ల జోలికి పోకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండి.


Also read: హార్వర్డ్ నిపుణులు చెప్పిన ఆరు ఉత్తమ ఆహారాలు ఇవే, తింటే డాక్టర్ అవసరం తగ్గుతుంది


Also read: విమానం క్రాష్ అయిన వీడియో చూశారా? ఆ వీడియో తీసింది ఆ విమానంలోని ప్రయాణికుడే