ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వచ్చిందంటే ప్రపంచ ప్రేమికులకు పండగే. ఈరోజు కోసం ఏడాదంతా వేచి చూస్తారు ప్రేమికులు. ఆ రోజు తమ ప్రేమను వ్యక్తపరచడానికి సిద్ధమవుతారు. కొన్ని సంవత్సరాలుగా వాలెంటెన్స్ డేను కాకుండా ‘వాలెంటెన్స్ వీక్’ను నిర్వహిస్తున్నారు. అంటే ఫిబ్రవరి 14కు ఏడు రోజుల ముందు నుంచే ప్రేమికుల పండగ మొదలైపోతుంది. అందులో మూడో రోజు ‘చాక్లెట్ డే’. తన ప్రేమనంత చాక్లెట్లో నింపి తన ప్రియునికి లేదా ప్రేయసికి ఇవ్వడమే ఈ చాక్లెట్ డే ఉద్దేశం. ఈ చాక్లెట్ డే కోసం ఎన్నో సంస్థలు ప్రత్యేకంగా చాక్లెట్లను తయారు చేస్తున్నాయి. లవ్ సింబల్ ఆకారంలో ఉన్న చాక్లెట్లను అమ్ముతున్నాయి. అవి హాట్ కేకుల్లా ఇప్పుడు అమ్ముడవుతున్నాయి. ప్రేమికుల పండగలో చాక్లెట్లు ప్రధానమైన విందు అని చెప్పుకోవచ్చు. ప్రేయసికి లేదా ప్రియునికి చాక్లెట్ ఇవ్వడం ద్వారా భాగస్వామిపై అంతులేని ప్రేమ చాటి చెప్పినట్టే.


ప్రేమే సృష్టికి మూలం. ఈ వాలెంటైన్స్ డే రోమన్ల కాలంలో మొదలైందని చెప్పుకుంటారు. ఆ కాలంలో జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త దీనికి సృష్టికర్త. ఆయన పేరు సెయింట్ వాలంటైన్. రోమ్ నగరంలో నివసించేవాడు. అప్పటి రోమ్ చక్రవర్తి నిర్ణయాన్ని వ్యతిరేకించి ఒకరినొకరు ప్రేమించుకోమని ప్రజల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించేవాడు. ఆ రోమన్ చక్రవర్తి మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే, మంచి సైనికులుగా ఉండలేరని అభిప్రాయపడేవాడు. దీంతో పెళ్లిళ్లు చేసుకోవడాన్ని నిషేధించాడు. కేవలం తన స్వార్థం కోసం పెళ్లిలను నిషేధించిన రోమన్ చక్రవర్తి ఆదేశాలు వాలెంటైన్ కు నచ్చలేదు. పెళ్లి అనేది మంచి కుటుంబాన్ని, తద్వారా మంచి సమాజాన్ని నిర్మించవచ్చని సెయింట్ వాలెంటైన్ నమ్మాడు. అందుకే ప్రజల్లో ప్రేమించుకోమని చెబుతూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. దీంతో ఆయన్ని జైల్లో పెట్టారు రోమన్ అధికారులు. జైల్లో ఉన్నప్పుడే ఆ జైలర్ కుమార్తెతో వాలెంటైన్ ప్రేమ వ్యవహారం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసి అతనికి ఫిబ్రవరి 14న మరణశిక్ష విధించారు. అందుకే ఆయన గుర్తుగా అదే రోజున వాలెంటైన్స్ డే ప్రపంచమంతా జరుపుకుంటుంది. 


అన్ని దేశాల్లో ఈ ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అమెరికా, మెక్సికో, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్ ఇలా చాలా దేశాల్లో వేడుకలు చాలా అట్టహాసంగా జరుగుతాయి. కానీ మిగతా దేశాల్లో కొన్నిచోట్ల వ్యతిరేకత ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు వాలెంటైన్స్ వీక్ గా నిర్వహిస్తారు. 
మొదటి రోజు - రోజ్ డే 
రెండో రోజు - ప్రపోజ్ డే 
మూడో రోజు - చాక్లెట్ డే 
నాలుగో రోజు - టెడ్డీ డే 
ఐదో రోజు - ప్రామిస్ డే 
ఆరో రోజు - హగ్ డే 
ఏడో రోజు - కిస్ డే 
ఇలా వాలెంటైన్స్ వీక్ పూర్తయ్యాక అప్పుడు ఫిబ్రవరి 14న వస్తుంది వాలెంటైన్స్ డే. ప్రేమైక సమాజాన్ని స్థాపించాలనుకున్న సెయింట్ వాలెంటైన్స్ చాలా చిన్న వయసులోనే మరణించాడు. అతని గుర్తుగా మిగిలిపోయింది ‘వాలెంటైన్స్ డే’.


Also read: గుడ్డు తినడం నిజంగా గుండెకు హానికరమా? వారానికి ఎన్ని గుడ్లు తినవచ్చు?



































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.