రోజు మొదట తీసుకునే భోజనంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు టైప్ 2 డయాబెటిస్ బాధితులకు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని యూబీసీ ఒకనాగన్ విద్యావేత్తల నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం వెల్లడించింది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ఇటీవల ప్రచురించిన పరిశోధన తెలిపింది. తక్కువ కొవ్వులు ఉండే అల్పాహారమైన ఓట్ మీల్, టోస్ట్, ఫ్రూట్ నుంచి తక్కువ కార్బ్ భోజనాన్ని తినడం మంచిదని సూచిస్తున్నారు. బేకన్ లేదా చీజ్ తో కూడిన గుడ్లు వంటి ప్రోటీన్ ఉన్న ఆహారం ఆరోగ్యకరం. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు భోజనం చేసిన తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగడం జరుగుతుంది. కానీ తక్కువ కార్బోహైడ్రేట్ భోజనం తీసుకుంటే రోజంతా రక్తంలో చక్కెరని నియంత్రించడంలో సహాయపడుతుంది.


ఇవి తినండి.. ఇవి వద్దు 


ఇన్ఫ్లమేషన్, కార్డియోవాస్కులర్ వ్యాధితో సహా అనేక సమస్యలను తగ్గించేందుకు గ్లూకోజ్ స్థాయిలని నియంత్రించడం చాలా కీలకం. తక్కువ కార్బ్, ప్రోటీన్, కొవ్వు అధికంగా ఉండే ఆహారం వల్ల హైపర్ గ్లైసిమిక్ స్వింగ్‌లను పరిమితం చేస్తుందని  పరిశోధకులు తెలిపారు. ఇటీవలి కాలంలో తక్కువ కార్బ్ ఆహారాలు ట్రెండీగా మారతాయి. గ్లూకోజ్ నియంత్రణని మెరుగుపరిచేందుకు ఇది మంచిది. 12 వారాల పాటు ఈ అధ్యయనం సాగింది. ఇందులో 120 మంది పాల్గొన్నారు. రెండు గ్రూపులుగా విడిపోయారు. 8 గ్రా కార్బోహైడ్రేట్, 25 గ్రా ప్రోటీన్, 37 గ్రాముల కొవ్వు తక్కువ ఉన్న ఆహారం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకున్నారు. మరొక గ్రూప్ కి 56 గ్రాములు కలిగి ఉన్న తక్కువ కొవ్వు అధిక కార్బ్ ఆహారం ఎంపిక చేశారు. కార్బోహైడ్రేట్లు, 20 గ్రాముల ప్రోటీన్, 15 గ్రాముల కొవ్వు తీసుకున్నారు. రెండు గ్రూపులోని వారిని అల్పాహారంగా 450 కేలరీలు అందించారు.


అధ్యయనంలో పాల్గొన్న వాళ్ళు తీసుకునే భోజనం ఫోటోలు అప్ లోడ్ చేశారు. డైటీషియన్ ఎప్పటికప్పుడు దాన్ని పరీక్షించారు. వారి రక్తంలో చక్కెర స్థాయిలు కొలవడానికి 12 వారాల ముందు తర్వాత A1C రక్త పరీక్షలను నిర్వహించారు. ఈ సమయంలో బరువు, నడుము చుట్టు కొలతను కూడా కొలిచారు. ఈ అధ్యయనం కొనసాగుతుండగా వారి ఫుడ్ ఫీలింగ్, శక్తి స్థాయిలు కూడా ఎలా ఉన్నాయో నివేదించారు. తక్కువ కార్బ్ ఆహారం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గుదల చూపించింది. మరికొందరు తమ గ్లూకోజ్ స్థాయిలని మందులతో కూడా తగ్గించుకోగలిగారు.


అల్పాహారం కోసం తక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు రోజంతా గ్లూకోజ్ స్థాయిని ఎలా అదుపులో ఉంచుతున్నారనే దాని మీద మరింత విస్తృతంగా పరిశోధన జరపాల్సిన అవసరం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తం ఆహారంలో మార్పులు కంటే భోజన్మలోని కార్బ్ కంటెంట్ లో చిన్న మార్పులు చేసుకుంటే గణనీయమైన ప్రయోజనాలు పొందుతారని పరిశోధకులు సూచిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!