Horoscope Today 2nd June 2023: జూన్ 2 శుక్రవారం మీ రాశిఫలితాలు


మేష రాశి  


ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.  జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.  సంతానం వలన ఒత్తిడికి గురవుతారు.  సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు  పెరుగుతాయి. వ్యాపారరంగంలో ఉన్నవారు  శుభవార్తలు వింటారు. తండ్రి సలహా మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సూచనలు. 


వృషభ రాశి


ఈ రాశివారికి సంఘంలో  గౌరవ మర్యాదలు . కుటుంబంలో తల్లితో మంచి అనుబంధం ఏర్పడుతుంది. తల్లికి విలువైన కానుకలు ఇస్తారు . భార్య తరుపు బంధువుల రాక ఉంటుంది..వారితో సత్స సంబంధాలు కొనసాగించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ సభ్యుల మధ్య   తలెత్తిన వివాదాలు  ఈ రోజుతో తొలగిపోతాయి. ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి..తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. విద్యార్థులు చదువుపై పూర్తి దృష్టి పెట్టాలి.


మిథున రాశి 


ఈ రోజు మీకు మంచిరోజు అవుతుంది. తలపెట్టిన పనులకు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మీరు ఎంచుకున్న రంగంలో మంచి లాభాలు పొందుతారు కానీ అంత సంతోషంగా ఉండరు. ఆలోచించకుండా ఏ పని చేయవద్దు . అనవసరమైన సలహాలు ఎవరికి ఇవ్వకండి లేనిపోని సమస్యలు చుట్టుముడతాయి.  అవివాహితులకు  వివాహ ప్రతిపాదనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ,బంధు మిత్రుల రాకపోకలుంటాయి. 


Also Read: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!


కర్కాటక రాశి


ఈ రోజు మీకు చాలా లాభదాయకమైన రోజు.  మీ ఆలోచనలు, వ్యక్తిత్వం మీ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటుంది. ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లి విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది.ప్రేమికుల మంచి రోజు. ఆదాయ వ్యయాల సమతుల్యత పాటిస్తే మంచిది. మీ తల్లితో ఏదో ఒక విషయం గురించి అనవసరమైన చర్చ జరగవచ్చు.


సింహ రాశి


గడిచిన రోజుల కన్నా ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఉద్యోగస్తులకు స్థాన మార్పిడి మంచిది కాదు...ఉన్న చోట ఉండటం మంచిది.  మీ శత్రువులు శ్రేయోభిలాషులుగా మారవచ్చు..వారితో  జాగ్రత్తగా ఉండాలి. నూతన ఆస్తుల కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు. రోజంతా ఆనందంగా గడుపుతారు.  మీ తల్లిదండ్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.  


కన్యా రాశి


ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. అనుకున్న పనులకు రేపటికి వాయిదా వేయాలి అనుకుంటారు కానీ సమయానికి పూర్తిచేయడమే మంచిది. వ్యాపారం చేసేవారు  చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టేవారికి ఈ రోజు మంచిది. పనిప్రాంతంలో, మీరు మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఎవరి నుంచి అప్పు తీసుకోకుండా ఉంటే మంచిది . 


తులా రాశి


ఈ రోజు మీకు అంతగా కలసిరాదు. తొందరపాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచిరోజు. అనవసర చర్చల్లో పాల్గొన వద్దు. విద్యార్థులు తమ సీనియర్ల అభిప్రాయం తీసుకుంటే మంచిది. ఉద్యోగులకు మంచిరోజు. 


Also Read: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం


వృశ్చిక రాశి 


ఈ రోజు మీరు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మనస్సు ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా సమాచారం ఇంటి నుంచి బయటకు వెళ్లవచ్చు. కుటుంబంలో వ్యక్తులు మీ మాటలకు ప్రాముఖ్యత ఇవ్వరు. ఉద్యోగులకు స్థానమార్పులుంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది.


ధనుస్సు రాశి 


ఈ రాశివారు ఈ రోజు అప్రమత్తంగా ఉండాల్సిన రోజు. మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల గురించి ఆందోళన చెందుతారు. ఆస్తి సంబంధిత వివాదం గురించి మీ మనస్సు ఆందోళన చెందుతుంది. కార్యాలయంలో మీరు చేసే కొన్ని పాత తప్పులు అధికారుల ముందుకొస్తాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేసేవారు పొదుపు పథకాలపై పూర్తి దృష్టి పెడతారు. కార్యాలయంలో పొరపాటు జరిగితే వెంటనే అధికారులకు క్షమాపణ చెప్పటం మంచిది. 


మకర రాశి


ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉంటుంది.  కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు.   మీ వ్యాపార ప్రణాళికలపై పూర్తి దృష్టి పెడతారు, అప్పుడే మీరు వాటిని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలి అనుకుంటే సులభంగా పొందుతారు. మీ రోజువారీ పనులను పరిష్కరించే ప్రయత్నంలో  నిమగ్నమవుతారు. సోమరితనాన్ని విడిచిపెట్టాలి. 


కుంభ రాశి


ఈ రోజు మీరు  అప్రమత్తతంగా ఉండాలి. పనిలో తొందరపాటు చూపించవద్దు..దానివల్ల సమస్యలు పెరుగుతాయి. పొట్ట, వెన్నుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందిపడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలుంటాయి. ప్రణాళికలు సకాలంలో అమలుచేస్తారు. 


మీన రాశి 


ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది.  మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సోదరుల సహాయ సహకారాలు అందుతాయి. ఈ రోజు తలపెట్టే పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకోపోతే భవిష్యత్ లో ఇబ్బందులు తప్పవు. ఉద్యోగులు, వ్యాపారులకు  మిశ్రమ ఫలితాలున్నాయి. విద్యార్థులు చదువుపై శ్రద్ధపెట్టాలి.