థైరాయిడ్ శరీరంలో జీవక్రియ చర్యలను నియంత్రించే బాధ్యత కలిగిన హార్మోన్లను విడుదల చేసే ముఖ్యమైన గ్రంథి. ఇది ఎక్కువ హార్మోన్లని విడుదల చేసినా, తక్కువ హార్మోన్లను విడుదల చేసినా కూడా సమస్యే. దాని వల్ల హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వస్తాయి. అయితే ఇది మాత్రమే కాదు థైరాయిడ్ గ్రంథికి క్యాన్సర్ కూడా రావచ్చు. గ్రంథిలో ప్రాణాంతక కణితులు ఏర్పడి థైరాయిడ్ క్యాన్సర్ గా పరిణితి చెందుతుంది. ఈ కణితులు సాధారణంగా ఉన్నప్పటికీ అవి ఎప్పుడు క్యాన్సర్ వి అని చెప్పలేము. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అది థైరాయిడ్ క్యాన్సర్ గా గ్రహించి సకాలంలో చికిత్స తీసుకుంటే నయం చేసుకోవచ్చు. ఈ క్యాన్సర్ ని వచ్చే ముందు కనిపించే సంకేతం అతిసారం. ఇది కడుపు, రొమ్ము క్యాన్సర్ మాదిరిగా కానప్పటికీ లింగం, వయసు, రేడియేషన్ కి గురవడం వంటి వాటికి ప్రభావితమవుతుంది.


థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు?


సాధారణం కంటే ఎక్కువగా టాయిలెట్ కి వెళ్ళడం వల్ల కాల్సిటోనిన్ అనే హార్మోన్ పెరిగిందని అర్థం చేసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది నిశ్శబ్ద లక్షణం. థైరాయిడ్ జీర్ణక్రియ, ఇతర శారీరక విధులను వేగవంతం చేస్తుంది. అతిసారం కాకుండా థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు మరికొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే..


⦿ మెడ ముందు లేదా దిగువ భాగంలో ఒక గడ్డ లేదంటే ముద్దలాగా ఏర్పడటం


⦿ గడ్డ నొప్పి ఉండదు కానీ పెద్దదిగా కనిపిస్తుంది


⦿ గొంతు మంట


⦿ గొంతు మారిపోవడం


⦿ మెడ ముందు భాగంలో విపరీతమైన నొప్పి


⦿ శ్వాస తీసుకోవడం లేదా ఆహారం మింగడంలో ఇబ్బంది


⦿ మెడ మీద బాగా ఒత్తిడి పడిన ఫీలింగ్


ఇతర లక్షణాలు


☀ దగ్గు


☀ అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం


☀ మొహం ఎర్రగా మారిపోవడం


థైరాయిడ్ అనేది మెడ కింద భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి. ఇది బరువు, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, హృదయ స్పందన రేటుని నియంత్రించే హార్మోన్లను విడుదల చేస్తుంది. దీని లక్షణాలతో ఉన్న 90 శాతం మంది వ్యక్తులు ఐదు సంవత్సరాల వరకు జీవిస్తారు. మరి కొంతమంది ఎక్కువ కాలం కూడా జీవించే అవకాశం ఉంది.


మెడ వాపుగా ఉండి అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. థైరాయిడ్ కణాలు వాటి డీఎన్ఏ లో మార్పులు సంభవించినప్పుడు ఈ క్యాన్సర్ వస్తుంది. దీని వల్ల ట్యూమర్ ఏర్పడుతుంది. అయోడిన్ తక్కువగా తీసుకోవడం, రేడియేషన్ కి అధికంగా గురవడం వంటి ఇతర కారణాల వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. క్యాన్సర్ దశని బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుంది. సకాలంలో గుర్తిస్తే దీన్ని నయం చేసుకోవచ్చు. సర్జరీ లేదా ఇతర చికిత్సల ద్వారా థైరాయిడ్ లో ఏర్పడిన క్యాన్సర్ కణాలు తొలగించుకోవచ్చు. సరైన టైమ్ కి మందులు వేసుకోవడం ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండటం వల్ల ఈ క్యాన్సర్ పెరుగుదలని నియంత్రించవచ్చు.  


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: జంక్ ఫుడ్ లాగించేస్తున్నారా? మీకు నిద్రపట్టడం కష్టమే!