పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్.. వీటిని చూస్తే ఎవరైనా నోరు కట్టేసుకుని ఉండగలుగుతారా చెప్పండి? అసలు ఉండలేరు.. ఎంతో టేస్టీగా ఉండే వాటిని చూస్తూ తినకుండా ఉండాలంటే అయ్యే పనే కాదు. కానీ ఈ అనారోగ్యకరమైన ఆహారం వల్ల ఆరోగ్యం చెడిపోవడమే తప్ప ప్రయోజనాలు తక్కువ. జంక్ ఫుడ్ తినడం వల్ల డీప్ స్లీప్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే వారితో పోలిస్తే అనారోగ్యకరమైన ఆహారం తీసుకునే వారి నిద్ర నాణ్యత తగ్గిపోతుందని తేలింది. సరైన ఆహారం తీసుకోకపోవడం, పేలవమైన నిద్ర రెండూ అనేక ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతాయి.


ఎక్కువ చక్కెర కంటెంట్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల నిద్ర సరిగా పట్టదని ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. మనం తినే వాటి ద్వారా గాఢ నిద్ర ప్రభావితం అవుతుంది. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఏం జరుగుతుందనే విషయం గురించి ఏ అధ్యయనం పరిశోధించలేదు. నిద్రలో హార్మోన్ల విడుదలని నియంత్రించే గాఢ నిద్ర వివిధ దశాలను కలిగి ఉంటాయి. ఉప్సల విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో 15 మంది వ్యక్తులు పాల్గొన్నారు. రెండు సెషన్లు నిర్వహించారు. ఇందులో ఆరోగ్యకరమైన బరువు కలిగిన యువకులు పాల్గొన్నారు. నిద్ర అలవాట్లు పరిశీలించారు. వాళ్ళకి సిఫార్సు చేసిన దాని ప్రకారం సగటున రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర పోయారు. వాళ్ళకి అనారోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం రెండూ ఇచ్చారు. రెండు ఆహారాలు ఒకే విధమైన కెలరీలు కలిగి ఉన్నాయి.


చక్కెర, సంతృప్త కొవ్వులు, ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నాయి. చెప్పిన టైమ్ ప్రకారం భోజనం తీసుకోవాలి. ఒక వారం పాటు ఇలాగే ఆహారం ఇచ్చారు. అవి తీసుకున్న తర్వాత వారి నిద్ర నాణ్యతని పరిశీలించారు. మొదటి రోజు రాత్రి నిద్ర బాగానే ఉంది. వారి మెదడు కార్యకలాపాలు పర్యవేక్షించారు. ప్రతిరోజు ఇదే విధంగా వారి నిద్రని పరీక్షించారు. ఈ సెషన్ లో పాల్గొనే వారు రెండు డైట్ లు తీసుకున్నప్పుడు ఒకే సమయంలో నిద్రపోతారు. రెండు ఆహారాలు తీసుకున్న వాళ్ళు వేర్వేరు నిద్ర దశలలో ఒకే సమయాన్ని గడిపారు. కానీ వారి గాఢ నిద్ర లక్షణాలు మాత్రం ప్రత్యేకంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడంతో పోలిస్తే జంక్ ఫుడ్ తిన్నప్పుడు గాఢ నిద్ర తక్కువ స్లో వేవ్ యాక్టివిటీని కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. వృద్ధాప్యం, నిద్రలేమి వంటి పరిస్థితుల్లో కూడా ఇలా గాఢ నిద్రలో సమస్యలు ఎదురయ్యాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర మీద ఎంతకాలం ప్రభావం చూపిస్తుందనే విషయం మీద స్పష్టతకు రాలేదు.


నిద్ర వల్ల మెమరీ పనితీరు ఎలా ప్రభావితం అవుతుందో, నిద్ర నాణ్యత ఎలా నియంత్రించబడుతుందనే దాని మీద మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారంలో ఏ పదార్థాలు గాఢ నిద్రని దిగజారుస్తున్నాయని అనే విషయం మాత్రం తెలియలేదు. ఈ రకమైన ఆహారాల్లో సంతృప్త కొవ్వు, చక్కెర, ఫైబర్ తక్కువ నిష్పత్తిలో ఉంటాయి. అందుకే ఇవి నిద్ర మీద ప్రభావం చూపిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: నిద్రలో కేకలు వేస్తూ గట్టిగా అరుస్తున్నారా? ఇది కూడా ప్రమాదకరమైన నిద్ర రుగ్మతే