ప్రపంచంలో నలభై కన్నా ఎక్కువ దేశాల్లో ఈ మాతృ దినోత్సవాన్ని ఇదే రోజు నిర్వహించుకుంటారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం రోజున కని పెంచిన తల్లి గొప్పతనాన్ని స్మరించుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం. ప్రతి ఏడాది మే నెల రెండో ఆదివారం ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. మొదటిగా ఈ వేడుకను గ్రీస్ దేశంలో నిర్వహించుకున్నారని చెబుతారు. అక్కడ రియా అనే దేవతను కొలుస్తారు. ఆమెను ‘మదర్ ఆఫ్ గాడ్స్’గా భావిస్తారు. అంటే దేవతలందరికీ ఆమెనే తల్లి అని నమ్ముతారు. ఆమెకు నివాళి అర్పించడానికి తొలిగా ఈ మదర్స్ డే నిర్వహించారని చెబుతారు. మరొక కథనం ప్రకారం ఈ ప్రత్యేక దినోత్సవం అమెరికాలో మొదలైందని కూడా అంటారు.  


మనదేశంలో తల్లిదండ్రులను దైవసమానులుగా పూజిస్తారు. పాశ్చాత్య దేశాల్లో పదహారేళ్లకే వేరు కుటుంబాలు పెట్టే ఆచారాలు ఉన్నాయి. మన దగ్గర మాత్రం తల్లిదండ్రులతోనే కొడుకు కుటుంబం కలిసి ఉండే ఆచారం ఉంది. పాశ్చాత్య దేశాల్లో రోజూ తల్లిని చూసుకుని, సేవ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా మదర్స్ డేను ఏర్పాటు చేసుకున్నట్టు చెబుతారు. తల్లిని పూజించే దినోత్సవం కాబట్టి అన్ని దేశాల వారికి ఈ కాన్సెప్ట్ నచ్చింది. అలా ఎన్నో దేశాలో మదర్స్ డే నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. 


కథనాల ప్రకారం 1872లో అమెరికాలో జూలియావర్డ్ హోవే అనే మహిళ ప్రపంచ శాంతి కోసం ఈ దినోత్సవాన్ని ప్రతిపాదించినట్టు చెబుతారు. యుద్ధం గుర్తులు మర్చిపోయేందుకు ‘మదర్స్ ఫ్రెండ్షిఫ్ డే’ను అన్నా మేరీ జెర్విస్ అనే మొదలుపెట్టింది. ఆమె 1905, మే 9న మరణించింది. దీంతో ఆమె కూతురు తన తల్లి వర్ధంతి రోజున మదర్స్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. ప్రతి ఏడాది మే రెండో ఆదివారం అమ్మల త్యాగాలకు గుర్తుగా మాతృ దినోత్సవం నిర్వహించుకోవాలని ప్రచారం చేసింది. ఆ ప్రచార ఫలితంగా 1910 తొలిసారి ఈ వేడుకను నిర్వహించారు. 1914లో అప్పటి అమెరికా అధ్యక్షులు ఉడ్రో విల్సన్ ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అమెరికాలో మాతృ దినోత్సవం జాతీయ సెలవుగా మారింది. ఆరోజు అమెరికాలో అమ్మలందరి దగ్గరికి తమ పిల్లలు చేరుకుంటారు. బహుమతులు ఇచ్చి, వారితోనే ఆ రోజంతా గడుపుతారు.  మనదేశంలో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీగా మారింది.



Also read: ప్రేమమూర్తి అయిన అమ్మకు అందంగా ఇలా తెలుగులోనే శుభాకాంక్షలు చెప్పండి




Also read: మీకు ఇష్టమైన పండు ఏదో చెప్పండి, మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది



Also read: షుగర్ వ్యాధిని అదుపులో పెట్టే అద్భుత ఔషధం ఇది, ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.