ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అప్పుడప్పుడు చేతులకు కాలిన గాయాలు తగులుతూ ఉంటాయి. చాలామంది వాటిని పట్టించుకోకుండా వదిలేస్తారు. అలా పట్టించుకోకుండా వదిలేస్తే అవి బొబ్బలు ఎక్కి, చీము పట్టి పెద్ద సమస్యగా మారొచ్చు. కాలిన గాయాలు తగిలిన వెంటనే కొన్ని రకాల పనులు చేస్తే అవి త్వరగా మానిపోతాయి. చాలామంది గాయం తగలగానే కొళాయి కింద పెట్టి నీటితో కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గాయం పెద్దది అవుతుంది. కానీ తగ్గదు. ఒక మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటిలో ముంచి కాలిన చర్మంపై పెట్టండి. ఇది త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలా వస్త్రాన్ని కప్పి ఉంచి మెల్లగా నొక్కుతూ ఉంటే బొబ్బలు ఎక్కకుండా ఉంటాయి. ఇలా బొబ్బలు రాకపోతే మచ్చలు ఏర్పడే అవకాశం కూడా తగ్గిపోతుంది. 


కొందరు ఐస్ ముక్కల్ని కూడా కాలిన గాయాలపై పెడుతూ ఉంటారు. వెంటనే మంటను తగ్గించడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఐస్ ముక్కలు తీశాక మంట మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే ఐస్‌లో కార్బన్ డయాక్సైడ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాలిన గాయాలకు ఈ కార్బన్ డయాక్సైడ్ తగలడం అంత మంచిది కాదు. దీనికి బదులుగా క్లాత్‌లో ఐస్ ముక్కలను కట్టి, ఆ క్లాత్‌ను కాలిన గాయాలపై ఉంచడం మంచిది. నేరుగా గాయాలకు తగలనివ్వకూడదు.


ప్రతి ఇంట్లో టూత్ పేస్ట్ ఉంటుంది. గాయం తగిలాక దాన్ని తడి వస్త్రంతో మెల్లగా వత్తాలి. టిష్యూతో తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత టూత్ పేస్టును రాయాలి. టూత్ పేస్ట్ రాసిన కాసేపటికే నొప్పి తగ్గుతుంది. అంతేకాదు అక్కడ బొబ్బలు రాకుండా గాయం కూడా త్వరగా నయమవుతుంది. పుదీనా ఫ్లేవర్ తో వచ్చే పేస్టులు వాడితే ఇంకా మంచిది. గాయం మరింత త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఇంట్లో వైట్ వెనిగర్ ఉంటే దాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో రెండు చుక్కల వెనిగర్ వేసి గాయంపై చల్లాలి. ఇది వాపు రాకుండా అడ్డుకుంటుంది. గాయాన్ని త్వరగా తగ్గేలా చేస్తుంది. కాలిన గాయాలకు బ్యాక్టీరియా పట్టకుండా ఉండాలంటే పసుపును వాడాలి. పసుపు నేరుగా గాయం పై వేసినా మంచిదే. లేదా కొద్దిపాటి పెరుగులో పసుపును వేసి గాయంపై రాస్తే ఇంకా మంచిది. ఈ రెండింట్లోనే యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువ. కాబట్టి బొబ్బలు రాకుండా, మచ్చలు ఏర్పడకుండా కాపాడతాయి. చెప్పకుండా ఉండాలంటే కాలిన వెంటనే కాస్త కొబ్బరి నూనెను రాసిన కూడా బొబ్బలు రావు. కొబ్బరిలో గాయాన్ని తగ్గించే లక్షణాలు ఉంటాయి. కాబట్టి గాయం కూడా త్వరగా తగ్గిపోతుంది కాకపోతే మచ్చ మాత్రం పడుతుంది.


Also read: చిరుధాన్యాలు తింటే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయా?


Also read: రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలా? అయితే ఈ పనులు చేయండి























































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.