ఆయుర్వేద శాస్త్రం చాలా గొప్పది. పూర్వం ఇంగ్లీషు వైద్యం కంటే ఆయుర్వేదానికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. ఎటువంటి రోగాలనైనా నయం చేయగల సామర్థ్యం వీటికి ఉందని నమ్మేవాళ్ళు. ఔషధ గుణాలు కలిగిన మూలికలు ఉపయోగించి మందులు తయారు చేసేవాళ్ళు. ఇవే కాదు మనం సీజనల్ వారీగా తీసుకునే పండ్లు కూడా ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. అవేంటంటే..


మామిడి


ఆయుర్వేద పండ్లలో 'రారాజు' అంటే మామిడి కాయ. వేసవిలో విరివిగా లభించే మామిడి అందరూ ఇష్టపడతారు. పండని పచ్చి మామిడి పండ్లు పిత్త, వాత దోషాలను పెంచుతాయి. కానీ పండిన వాటిని తీసుకుంటే చాలా మంచిది. రుచికరంగా ఉండే పండిన మామిడి తింటే వాత, పిత్త దోషాలను సమతుల్యం చేస్తాయి.


పుచ్చకాయ


వేసవిలో చలువ చేసే మరొక పండు పుచ్చకాయ. సమ్మర్ సీజన్ లో అత్యధికంగా లభిస్తుంది. పుచ్చ ముక్కలు లేదా జ్యూస్ ఎలా తీసుకున్నా ఆరోగ్యమే. ఆయుర్వేద ఔషధాల్లో పుచ్చకాయ వినియోగిస్తారు. ఇది పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వేడి వాతావరణంలో మిమ్మల్ని చల్లబరుస్తుంది.


దానిమ్మ


రక్తహీనత నుంచి బయట పడేసే వాటిలో దానిమ్మ పండు ముందుంటుంది. ఇందులో ఆస్ట్రిజెంట్ పుల్లని రుచిని కలిగి ఉంటుంది. పిత్తను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మతో చేసిన చట్నీ తింటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది. టాక్సిన్స్ తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.


పియర్


హార్మోన్లను నియంత్రించడంలో పియర్స్ మేలైన పండ్లు. జ్యూసీ, తీపి రుచి పొందాలంటే తాజా పియర్ పండు తినాలి. శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడంలో పియర్ గొప్పగా పని చేస్తుంది.


ద్రాక్ష


ఆయుర్వేదంలో ఎండు ద్రాక్ష, తీపి ద్రాక్షకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అనేక ఆయుర్వేద గ్రంథాలలో ద్రాక్షను ఉత్తమ ఫలాలుగా చెప్పుకొచ్చారు. ఫుడ్డింగ్, స్వీట్ లకు వీటిని జోడిస్తే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించుకుని తింటే చాలా బాగుంటుంది.


అరటి పండు


సాధారణంగానే అరటి పండు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని లోని ఆల్కలీన్ స్వభావం కారణంగా అరటి ఆమ్ల పరిస్థితులను తటస్థీకరిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలకు చికిత్స చేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో ఉన్న మహిళలు వీటిని తినొచ్చు. అయితే పరిమితికి మించి తింటే మాత్రం అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


యాపిల్


రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ ని దూరం పెట్టవచ్చని అంటారు. కఫ దోషాన్ని బ్యాలెన్స్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. పుల్లని పచ్చి యాపిల్స్ పిత్త, వాతాన్ని పెంచుతాయి. పండిన యాపిల్స్ ఓజస్ ఉత్పత్తిలో సహాయపడతాయి. మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


పనస పండు


యాంటీ ఆక్సిడెంట్లు, కెరొటీనాయిడ్, ఫినోలిక్ సమ్మేళనాలు,, ఇతర ఫైటో న్యూట్రీయెంట్లు అనేక రోగాల చికిత్సకు ఉపయోగపడతాయి. పనస పండు మాత్రమే కాదు దాని విత్తనాలలోనూ ఔషధ గుణాలు ఉన్నాయి.


ఉసిరి


మూడు దోషాలను సమన్వయం చేయడంలో ఉసిరి ఉత్తమంగా పని చేస్తుంది. ఆరోగ్యానికి మద్దతు ఇచ్చే దైవిక ఆహారం. ఉసిరిని చక్కెర, మసాలా దినుసులతో కలిపి మురబ్బాగా చేస్తే శక్తినిస్తుంది.


బేల్ పండు


హిందూ మతం బేల్ చెట్టుని గౌరవిస్తుంది. ఇది తింటే జీర్ణక్రియపై ప్రభావవంతంగా పని చేస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంది. సాధారణంగా దీన్ని డయేరియా చికిత్సకు ఉపయోగిస్తారు. డైటరీ సప్లిమెంట్ గా బేల్ చెట్టు ఆకులు వినియోగిస్తారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: రోజుకొక తమలపాకు నమిలితే ఆ రోగాలేవీ మీ దరిచేరవు