తమలపాకు లేనిదే భారతీయుల ఇళ్ళలో ఏ పూజ జరగదు. భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దాదాపు ఐదు వేల సంవత్సరాల చరిత్ర తమలపాకుకి ఉంది. హృదయాకారంలో ఉండే ఈ ఆకు గురించి వివిధ పురాతన, మత గ్రంథాల్లో కూడా ప్రస్తావించారు. ఇందులోని ఔషధ గుణాలతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు. ఆయుర్వేదంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజుకి రెండు తమలపాకులు నమిలి తింటే మంచిదని అంటారు. మన దేశంలో చాలా మందికి భోజనం చేసిన తర్వాత తమలపాకులు నమిలే అలవాటు ఉంటుంది. మౌత్ ప్రెషనర్ గా పని చేస్తుంది. అజీర్తి సమస్య లేకుండా నివారిస్తుంది. ఇటువంటి మరెన్నో ప్రయోజనాలు తమలపాకు వల్ల ఉన్నాయి.


వేసవిలో తమలపాకు తింటే కలిగే ప్రయోజనాలు


నీటిశాతం సమృద్ధి


తమలపాకులలో తక్కువ కొవ్వులు ఉంటాయి. అధిక తేమని కలిగి ఉండటం వల్ల నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది. తమలపాకులతో చేసిన ఉత్పత్తులని తీసుకోవడం వల్ల వేసవి కాలంలో వేడిని అధిగమించవచ్చు.


కూలింగ్ ఏజెంట్


గుల్కండ, సోంపు గింజలు, తురిమిన కొబ్బరి, రాక్ షుగర్ లేదా మిశ్రి తీసుకుని అందులో ఒక కప్పు నీళ్ళతో కలిపి పాన్ లేదా తమలపాకులతో పాన్ షాట్ తయారు చేసుకోవచ్చు. వేసవి తాపాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.


రక్తస్రావం ఆపుతుంది


వేసవి వేడి వల్ల కొంతమందికి ముక్కు నుంచి రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడతారు. వడదెబ్బను తమలపాకులు నిరోధిస్తాయి. ముక్కు నుంచ్చ రక్తస్రావం ఆపేందుకు ఇవి సహాయపడతాయి.


చర్మానికి మేలు


చర్మ సమస్యలతోను పోరాడతాయి. వీటిలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. మొటిమల సమస్య ఎదుర్కోవడానికి చక్కగా పని చేస్తాయి. చర్మ అలర్జీలు, పొడి చర్మం వల్ల వచ్చే దద్దుర్లు నయం చేయడానికి సహాయపడుతుంది. నల్లమచ్చలు, వడదెబ్బకి చికిత్స చేస్తుంది.


విటమిన్ సి పుష్కలం


వీటిలో విటమిన్ సి, రిబోఫ్లావిన్, థయామిన్, నియాసిన్, కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇవే కాదు ఎముకలను బలోపేతం చేసేందుకు అవసరమైన కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.


నొప్పి నుంచి ఉపశమనం


నొప్పిని తగ్గించడంలో పాన్ ఆకులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఆకుల పేస్ట్ ని గాయాల మీద రాసుకోవచ్చు. తమలపాకు రసం తీసుకోవడం వల్ల శరీరంలోని లోపలి నొప్పులు కూడా తగ్గుతాయి. వాపుని తగ్గిస్తుంది.


జీర్ణక్రియ మెరుగు


భోజనం తర్వాత ఎక్కువ మంది పాన్ తీసుకోవడానికి కారణం ఇందులో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఉన్నాయి. అలాగే జీవక్రియను పెంచుతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ముఖ్యమైన విటమిన్లు, పోషకాలను గ్రహిస్తుంది. పేగులు ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది.


నోటి ఆరోగ్యం


తమలపాకు నమలడం వల్ల నోటి దుర్వాసన, కావిటీస్, ఫలకం దంతక్షయం ఏర్పరిచే బ్యాక్టీరియాను ఎదుర్కొంటుంది.


బరువు తగ్గుతారు


బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. శరీరంలోని కొవ్వుని కరిగిస్తుంది. జీవక్రియ రేటుని పెంచుతుంది.


క్యాన్సర్ నిరోధక ఏజెంట్


యాంటీఆక్సిడెంట్, యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ ప్రొలిఫెరేటివ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: మీ పిల్లల కళ్లు ఈ కలర్‌లోకి మారుతున్నాయా? జాగ్రత్త, అది కరోనా కొత్త వేరియంట్ ఆర్క్టురస్ లక్షణం