సీజనల్ వారీగా వచ్చే పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదనే విషయం అందరికీ తెలిసిందే. చాలా మంది రకరకాల పండ్లు ముక్కలుగా కోసి సలాడ్ గా చేసుకుని తింటారు. మరి కొంతమంది వాటితో కొన్ని కూరగాయల ముక్కలు కూడా కలిపి ఉప్పు జోడించి తీసుకోవడం చేస్తారు. ఇలా తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటారు. అయితే పండ్లు అన్నింటినీ కలిపి తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని పండ్లు, కూరగాయలు ఎలా కలిపి తీసుకోకూడదో అలాగే కొన్ని పండ్లు మరికొన్ని పండ్లతో కలిపి తినకూడదు. ఇలా విరుద్ధమైన పండ్లను కలిపి తినడం వల్ల జీర్ణక్రియకి ఆటంకం కలిగిస్తాయి.
మిలాన్స్ ‘బ్రహ్మచారి’
పుచ్చకాయ, కర్బుజాలు, సీతాఫలాలు బ్రహ్మచారి రకం పండ్లు. అవి ఎవరితోనే జతకట్టవు. ఇతర పండ్లతో కలిపి వాటిని తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. ఎందుకంటే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇతర పండ్ల కంటే నీరు ఎక్కువగా ఉండే పండ్లు వేగంగా జీర్ణం అవుతాయి. ఇతర పండ్లతో పుచ్చకాయ, ఖర్బూజ, వంటి మిలాన్స్ కలిపి తీసుకోవడం మానేయాలి.
తీపి పండ్లతో ఆమ్లాలు కలపకూడదు
ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఆమ్ల పండ్లను యాపిల్, దానిమ్మ, పీచ్ వంటి వాటిని కలిపి తీసుకోకూడదు. అలాగే అరటి, ఎండుద్రాక్ష వంటి వాటిని కూడా కలపకూడదు. ఇవి జీర్ణక్రియకి ఆటంకం ఏర్పరుస్తాయి. సబ్ యాసిడ్ పండ్లతో ఆమ్లాన్ని కలిపి తీసుకోవచ్చు. ఇవే కాదు జామ, అరటి కూడా కలిపి తీసుకోకూడదు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ పండ్లు ఒకేసారి తినడం వల్ల వికారం, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
కూరగాయలు, పండ్లు కలిపి తీసుకోకూడదు
పండ్లు, కూరగాయలు భిన్నంగా జీర్ణం అవుతాయి. పండ్లు త్వరగా జీర్ణక్రియని కలిగి ఉంటాయి. అవి తినేటప్పుడే కడుపులోకి చేరే సమయానికి పాక్షికంగా జీర్ణమవుతాయని పోషకాహార నిపుణులు వెల్లడించారు. అలాగే పండ్లలో ఎక్కువగా చక్కెర కంటెంట్ ఉంటుంది. కూరగాయలు జీర్ణ ప్రక్రియకి ఆటంకం కలిగిస్తుంది. అదే కారణం వల్ల క్యారెట్ ని నారింజతో కలపకూడదు. వాటిని కలిపి తీసుకుంటే గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది.
అధిక ప్రోటీన్ తో పిండి పదార్థాలు కలపకూడదు
కొన్ని పండ్లు మాత్రమే పిండి స్వభావం కలిగి ఉంటాయి. వీటిలో ఆకుపచ్చ అరటి ఉంది. మొక్కజొన్నలు, బంగాళాదుంపలు, ముల్లంగిలో పిండి పదార్థాలు ఉంటాయి. వీటిని అధిక ప్రోటీన్లు కలిగిన ఎండుద్రాక్ష, జామ, బచ్చలికూర, బ్రొకోలీ వంటి కూరగాయాలతో ఎప్పుడు కలపకూడదు.
ఇవి అసలు మరువద్దు
⦿ ఒకేసారి 4-6 పండ్లు తినకూడదు.
⦿ మీకు ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుని ఉండే మరుసటి రోజు ఉదయం బొప్పాయి తినాలి. ఎందుకంటే దానిలో పపైన్ ఉంటుంది.
⦿ ఉప్పు ఎక్కువగా తింటే మరుసటి రోజు ఉదయం నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ తినాలి.
⦿ పాస్తా వంటి అదనపు పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మరుసటి రోజు వాటిని విచ్చినం చెయ్యడానికి యాపిల్ తీసుకోవాలి. పాస్తాలో ఉన్న కార్బోహైడ్రేత్ల నుంచి వచ్చే ఉబ్బరాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ముక్కు నుంచి రక్తం కారుతోందా? ఇలా చేసి ఆపేద్దాం
Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు