ఉదయాన్నే నిద్రలేవగానే వేడి వేడి కాఫీ తాగితే చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. కాఫీ కొంత వరకు ఆరోగ్యాన్నికి మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంతో పాటు మానసిక స్థితిని కూడా తేలికపరుస్తుంది. అందుకే చాలా మంది టీ కంటే కాఫీనే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టుని సంరక్షించుకోవడానికి కూడా కాఫీ బాగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా? జుట్టుకి మేలు చేసే కొన్ని పదార్థాలతో కాఫీని మిళితం చేసుకోని బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు. కాఫీ జుట్టు పెరుగుదలని వేగవంతం చేస్తుంది. అంతే కాదు స్కాల్ఫ్ ను ఎక్స్ ఫోలియేట చేస్తుంది. తలలో రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుంది. జుట్టు బలంగా అయ్యేలా చేస్తుంది.


పెళుసుగా, చిట్లిన జుట్టు కోసం.. 


కావలసిన పదార్థాలు


పెరుగు


కాఫీ పొడి


నిమ్మరసం


తయారీవిధానం


1 కప్పు పేరుగులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి ముద్దలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ లో అర టీస్పూన్ నిమ్మరం వేసి మరోసారి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.


అప్లై చేసే విధానం


జుట్టు కుదుళ్ళ వరకు ఈ మిశ్రమాన్ని బాగా తలకి పట్టించాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు జుట్టుకు మృదుత్వాన్ని ఇస్తుంది. కాఫీ జుట్టుకి మరింత మెరుపు జోడిస్తుంది.


జుట్టు పెరుగుదల కోసం


కావలసినవి


కాఫీ


కొబ్బరి నూనె


తయారీ విధానం


¼ కప్పు కొబ్బరి నూనె వేడి చేసి 1 టేబుల్ స్పూన్ కాల్చిన కాఫీ గింజలు అందులో వేయాలి. హెయిర్ వాష్ కు ముందు వారానికి రెండు సార్లు పట్టించాలి.


ఫలితం


కొబ్బరినూనెతో తయారు చేసిన కాఫీ పౌడర్ తలలో రక్తప్రసరణ పెంచుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.


హెయిర్ డైగా కూడా..


కావలసినవి


కాఫీ పొడి


నిమ్మకాయ


దాల్చిన చెక్క


తయారీ విధానం


ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ వేసి డానికి 2-3 చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి చివర్లో కొద్దిగా దాల్చిన చెక్క వేయాలి.


అప్లై చేసే విధానం


ఈ పేస్ట్ ని తడి జుట్టు మీద హెయిర్ డై మాదిరిగా అప్లై చేసుకోవాలి. ఒక గంట పాటు దాన్ని అలాగే ఉంచాలి. తర్వాత చల్లని నీరు, తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. తెల్ల జుట్టు కనిపించకుండా చేసేందుకు కాఫీ సహజమైన హెయిర్ డైగా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను ఇందులో కలుపుకోవడం వల్ల స్కాల్ఫ్ ని ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది.


జుట్టు సంరక్షణ కోసం


కావలసినవి


కాఫీ పొడి


తేనె


తయారీ విధానం


1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్లో ఒక టేబుల్ స్పూన్ తేనే కలుపుకోవాలి. రెండింటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. కాఫీ జుట్టు పునరుత్పత్తిని ప్రోత్సాహిస్తుంది. జుట్టు సమస్యలన్నింటికి తేనె చక్కని పరిష్కారం.


ఆరోగ్యకమైన కురుల కోసం


కాఫీతో కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు. జుట్టుకి ఎప్పటిలాగానే షాంపూ చేసి టవల్ తో అరబెట్టుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న కాఫీని జుట్టు మీద పోసి 5 నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. తర్వాత మంచి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. మీ జుట్టు షాంపూ చేసిన ప్రతిసారీ ఇలా చేసుకోవచ్చు. అదే కాదు ఆ కాఫీని జుట్టు చివర్ల రిన్స్ గా ఉపయోగించొచ్చు. ఇది కడగాల్సిన అవసరం లేదు ప్రతి హెయిర్ వాష్ తర్వాత రిపీట్ చేసుకోవచ్చు.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


 Also Read: పండగవేళ మెరిసే చర్మం కోసం ఈ మ్యాజికల్ వాటర్


Also Read: సన్ ఫ్లవర్ నూనెతో మెరిసే చర్మం మీ సొంతం