గుప్పెడంత మనసు గురువారం ఎపిసోడ్  ( Guppedantha Manasu September 29 Today Episode 568)


వసుపై కోపంతో రిషి కాలేజీకి వెళ్లిపోతాడు. ఆ వెనుకే ఫాలో అయిన వసుధార..రిషి సోపాలో నిద్రపోతుండగా దెబ్బతగిలిన చేతికి కట్టుకడుతుంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అంటే..మీరు వెళితేనే నేను వెళతాను అంటుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అనడంతో.. బ్లాక్ మెయిల్ కాదు ఓ మనసు కోసం ఇంకో మనసు పడే తపన ఇది అని చెబుతుంది.
రిషి: నువ్వు ఇలా తయారయ్యావేంటి..నాకు కోపం తెప్పిస్తున్నావ్..
వసు: మీకు కోపం వచ్చినా మీ వెంటే నేనుంటాను
రిషి: నీతో వాదించలేను..క్యాబ్ వచ్చింది వెళ్లు..
వసు: ఎంత కోపంగా ఉన్నా కేరింగ్ మాత్రం తగ్గదు...మీరు జెంటిల్మెన్ సార్..
వసు క్యాబ్ లో వెళ్లగానే రిషి ఇంటికెళతాడు...


Also Read: దుర్గ రీఎంట్రీ ఇక మోనితకు దబిడి దిబిడే, సంతోషంలో దీప-షాక్ లో కార్తీక్


మహేంద్ర,జగతి ఇద్దరూ రిషి కోసం టెన్షన్ పడుతుంటారు.. రిషి కోపంగా బయటకు వెళ్లాడని జగతి అంటే రిషి మూడ్ ఎప్పుడు శాంతంగా ఉందని అంటారు మహేంద్ర. ఇంతలో దేవయాని అక్కడకు వస్తుంది. 
దేవయాని: ఏంటి..ఆలూమగలిద్దరూ సైలెంట్ గా ఉన్నారు..ఏం ఆలోచిస్తున్నారేంటి..
జగతి: రిషి మూడాఫ్ లో బయటకు వెళ్లాడు..మహేంద్ర చేస్తే తీయడం లేదు..మీరొకసారి కాల్ చేయండి అక్కయ్యా మీ ఫోన్ తీస్తాడు కదా..
దేవయాని: నీ స్వభావానికి విరుద్ధంగా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నావ్..నన్ను అడగకూడదు కదా నువ్వు మెట్టు దిగి అడిగావే అనుకో నేను చేస్తాను అనుకుంటున్నావా..
జగతి: నువ్వు నేను కాల్ చేస్తే రిషి తీయకపోవచ్చు కానీ అక్కయ్య కాల్ చేస్తే తీయొచ్చు కదా..
దేవయాని: ఇప్పుడేదే అవసరం ఉందని ఫోన్ చేయమంటున్నావ్..తప్పు జగతి..నువ్వు అడగకూడదు..అడిగినా చేయకూడదు.. కాల్ చేసి ఏమని అడగాలి..నువ్వు అమ్మా అని పిలవని అమ్మ కంగారుపడుతోంది ఎక్కడున్నావ్ అని అడగలేను కదా...
ఇంతలో అక్కడకు వచ్చిన ధరణి..నేను కాల్ చేస్తాను లిఫ్ట్ చేస్తాడు అంటుంది ధరణి.. దేవయాని లోపలకు పో అని కోప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది ధరణి... ఇంతలో రిషి రానే వస్తాడు..
దేవయాని: రిషి రాగానే విసిగించకు గౌతమ్..ఎన్నో పనులుంటాయి ఎన్నో టెన్షన్లు ఉంటాయని చెప్పి... రిషి లోపలకు రాగానే డ్రామా స్టార్ట్ చేస్తుంది...
ఎవ్వరూ సీన్ చేయకండి, నన్ను డిస్ట్రబ్ చేయొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.. రిషి ఏం చెప్పాడో అర్థమైంది కదా అంటుంది దేవయాని...


Also Read: వెళ్లిపొమ్మన్న రిషి , ఇద్దరం ఒక్కటే అన్న వసు - రిషిధార ప్రేమయుద్ధం
రూమ్ లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటాడు రిషి.. ఇంట్లోకి కంగారుగా వస్తుంది వసుధార.. వసుని చూసిన దేవయాని ఇదేంటి ఏకంగా ఇంటికొచ్చి సరాసరి రిషిగదికే వెళుతోంది అనుకుంటూ వెనుకే ఫాలో అవుతుంది. ఎదురుగా నిల్చున్న వసుని చూసి అంతా భ్రమే అనుకుంటాడు... వసు మాత్రం భోజనం చేశారా అని అడుగుతుంది...నువ్వు నిజంగా వచ్చావా అని అడుగుతుంది..


అటు జగతి-ధరణి రిషికి భోజనం తీసుకెళుతుండగా దేవయాని పిలుస్తుంది..లోపలకు పదండి మీ ఒళ్లు పులకరించి పోతుందని చెప్పి అందరూ రండి అని పిలుస్తుంది.. ధరణి చేతిలో భోజనం ప్లేట్ లాక్కుంటుంది.
దేవయాని: ఏదైనా పనిమీద వెళుతూ ఇక్కడకు వచ్చావా వసుధారా
వసు: లేదు మేడం..రిషి సార్ కోసమే వచ్చాను..
నువ్వింకా భోజనం చేయకపోవడం ఏంటి అన్నం తిను అని బతిమలాడుతుంది.. జగతి , మహేంద్ర, గౌతమ్, ధరణి అందరూ బతిమలాడతారు.. 
దేవయాని: ఎందుకు అందరూ హడావుడి చేస్తున్నాను నేను పెడతాను కదా అని లేనిపోని ప్రేమ నటిస్తుంది
నాకు నిజంగానే తినాలని అనిపించడం లేదంటాడు..రియాక్టైన వసుధార ఇలా ఇవ్వండి మేడం ఎలా తినరో చూస్తానంటూ ప్లేట్ తీసుకుంటుంది...
వసు: ఏంటి సార్ అలా చూస్తున్నారు అసలా గాయం ఎలా అయింది..తినండి సార్..
రిషి: ఏంటి వసుధార ఇంత దూకుడుగా ఉంది..ఇప్పుడు తినకపోతే అనే ఆలోచనలో పడిన రిషి.. తినడమే మంచిది అనుకుంటాడు...
దేవయాని కుళ్లుకుంటుండగా..మిగిలినవారంతా సంతోషిస్తారు... నువ్విలా రిషిని కమాండ్ కూడా చేస్తావా అనుకుంటాడు గౌతమ్. దేవయాని మాత్రం రగిలిపోతుంటుంది..అటు మహేంద్ర వాళ్లకి ప్రైవసీ కల్పించాలని ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.. ఇక్కడుంటే ఇంకేం పనులు చెబుతుంతో ఏమో అనుకుంటూ దేవయాని కూడా వెళ్లిపోతుంది...


అందరూ వెళ్లిపోయిన తర్వాత పక్కన కూర్చుని తినిపిస్తుంది.. ఒకరి మీద కోపాన్ని భోజనంపై చూపించొద్దు సార్ తినండి అంటుంది. 
రిషి: ప్రేమైనా కోపం అయినా ఎవరిపై చూపించాలో నాకు తెలుసు..అయినా ఎందుకిదంతా
వసు: రావాలి అనిపించింది వచ్చాను..మిమ్మల్ని మీరే శిక్షించుకోవద్దు..
రిషి: నువ్వు కూడా తిను..గౌతమ్ ని తోడుతీసుకుని వెళ్లు
రిషి చేయి చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది వసుధార.. అన్నం తినిపించిన తర్వాత..నేను వెళతాను సార్ జాగ్రత్త అంటుంది.... పొగరు అస్సలు తగ్గడం లేదనుకున్న రిషి..ఎంత దురుసుగా మాట్లాడినా నాకు అందులో తన ప్రేమే కనిపిస్తోంది అనుకుంటాడు..
అటు వసుధార ప్లేట్ వంటింట్లో పెట్టేసి వెళ్లిపోతుంది..


మహేంద్ర,జగతి,గౌతమ్ ముగ్గురూ వసు-రిషి గురించి డిస్కషన్ పెడతారు.. ఇద్దరూ వదులుకోలేరు..ఇద్దరూ తగ్గడం లేదు.. ఏం చేద్దాం అనుకుంటారు..ఈ ఇద్దరి పంతం ఇలాగే కొనసాగితే పరిస్థితులు చేజారిపోతాయేమో అని జగతి భయపడుతుంది. ఆ మాటకి స్పందించిన మహేంద్ర ఇద్దరూ దూరంగా ఉండడం కరెక్ట్ కాదు..ఇద్దర్నీ ఒకే దగ్గర ఉండేలా చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇద్దరూ కలసి ఉండే అవకాశం కాలేజీలో ఉంది కానీ పరీక్షలు అయిపోయాయి కదా వసుకి వచ్చే అవకాశం లేదంటుంది జగతి. ఏం చేద్దాం అనే ఆలోచనలో ఉన్న మహేంద్ర..మిషన్ ఎడ్యుకేషన్ పేరుతో ఇద్దర్నీ ఓచోట చేర్చేందుకు ప్లాన్ చేస్తారు....