శ్వయుజ శుద్ధ చవితి శరన్నవరాత్రుల్లో 4 వ రోజు. ఈ రోజు అవతారం అన్నపూర్ణాదేవి. సమస్త జీవులకు ఆహారాన్ని అందించే తల్లిగా ఆరాధించుకుంటారు. అమ్మవారి అనుగ్రహంతో ఆహారం లభిస్తుంది. ఈ తల్లిని ఆరాధించుకుంటే అన్నానికి లోటు ఉండదని అంటారు. గంధం లేదా పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. ఈ రంగు ఇవ్వటానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. ఈ రోజున దేవికి అల్లం గారెలు, క్షీరాన్నం, దద్యోధనం నైవేద్యంగా సమర్పిస్తారు.


అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే


జ్ఞాన వైరగ్య సధ్ధ్యర్థం. భిక్షాం దేహిచ పార్వతి


మాత చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర:


బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్


అన్నపూర్ణా దేవి అభయంకరి. అన్ని భయాలను దూరం చేస్తుంది. దారిద్రయనాశిని. తల్లి ఒక చేతిలో అక్షయపాత్ర, మరోచేతిలో గరిటే తో ఉండే దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. అమ్మవారు ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతార విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది. ఇవాళ అమ్మవారిని తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పుష్పాలతో పూజించాలి. ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్ధివికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత, వాక్‌సిద్ధి, శుద్ధి కలుగుతాయి. మానవుడ్ని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది.  తల్లి చేతి భోజనం కోసం స్వయంగా విశ్వేశ్వరుడే భిక్షపాత్ర చేత ధరించి ఆమె ముందు నిలబడ్డాడని చెప్పుకుంటారు. ఈ రోజున అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి.   వీటితో  పాటు ఈ రోజున ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి కూడా చదువుకోవాలి. 


ఈ మంత్ర సాధాన వల్ల కలిగే లాభాలు



  • ఇంట్లో దారిద్రయం నశిస్తుంది.

  • నిరంతరం అన్నపూర్ణ మంత్రాన్ని జపిస్తే ఆ చోట ఆహార కొరత ఉండదు.

  • భోజనానికి ముందు లేదా వంట ప్రారంభించే ముందు అన్నపూర్ణ స్తోత్ర పఠనం చేస్తే అద్భుతమైన భోజనం తయారవుతుందని ప్రతీతి.


శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళిః
ఓం అన్నపూర్ణాయై నమః
ఓం శివాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం భీమాయై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం పార్వత్యై నమః
ఓం దుర్గాయై నమః 
ఓం శర్వాణ్యై నమః
ఓం శివవల్లభాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం విద్యాదాత్రై నమః
ఓం విశారదాయై నమః
ఓం కుమార్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం బాలాయై నమః 
ఓం లక్ష్మ్యై నమః
ఓం శ్రియై నమః
ఓం భయహారిణ్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం విష్ణుజనన్యై నమః
ఓం బ్రహ్మాదిజనన్యై నమః
ఓం గణేశజనన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం కుమారజనన్యై నమః 
ఓం శుభాయై నమః
ఓం భోగప్రదాయై నమః
ఓం భగవత్యై నమః
ఓం భక్తాభీష్టప్రదాయిన్యై నమః
ఓం భవరోగహరాయై నమః
ఓం భవ్యాయై నమః
ఓం శుభ్రాయై నమః
ఓం పరమమంగళాయై నమః
ఓం భవాన్యై నమః 
ఓం చంచలాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం చారుచంద్రకళాధరాయై నమః
ఓం విశాలాక్ష్యై నమః
ఓం విశ్వమాత్రే నమః
ఓం విశ్వవంద్యాయై నమః
ఓం విలాసిన్యై నమః
ఓం ఆర్యాయై నమః
ఓం కళ్యాణనిలాయాయై నమః 
ఓం రుద్రాణ్యై నమః
ఓం కమలాసనాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం వృత్తపీనపయోధరాయై నమః
ఓం అంబాయై నమః
ఓం సంహారమథన్యై నమః
ఓం మృడాన్యై నమః 
ఓం సర్వమంగళాయై నమః
ఓం విష్ణుసంసేవితాయై నమః
ఓం సిద్ధాయై నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం సురసేవితాయై నమః
ఓం పరమానందదాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం పరమానందరూపిణ్యై నమః
ఓం పరమానందజనన్యై నమః 
ఓం పరాయై నమః
ఓం ఆనందప్రదాయిన్యై నమః
ఓం పరోపకారనిరతాయై నమః
ఓం పరమాయై నమః
ఓం భక్తవత్సలాయై నమః
ఓం పూర్ణచంద్రాభవదనాయై నమః
ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః
ఓం శుభలక్షణసంపన్నాయై నమః
ఓం శుభానందగుణార్ణవాయై నమః 
ఓం శుభసౌభాగ్యనిలయాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం చండికాయై నమః
ఓం చండమథన్యై నమః
ఓం చండదర్పనివారిణ్యై నమః
ఓం మార్తాండనయనాయై నమః
ఓం సాధ్వ్యై నమః
ఓం చంద్రాగ్నినయనాయై నమః 
ఓం సత్యై నమః
ఓం పుండరీకహరాయై నమః
ఓం పూర్ణాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం శ్రేష్ఠమాయాయై నమః
ఓం శ్రేష్ఠధర్మాత్మవందితాయై నమః
ఓం అసృష్ట్యై నమః 
ఓం సంగరహితాయై నమః
ఓం సృష్టిహేతవే నమః
ఓం కపర్దిన్యై నమః
ఓం వృషారూఢాయై నమః
ఓం శూలహస్తాయై నమః
ఓం స్థితిసంహారకారిణ్యై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం స్కందమాత్రే నమః
ఓం శుద్ధచిత్తాయై నమః 
ఓం మునిస్తుతాయై నమః
ఓం మహాభగవత్యై నమః
ఓం దక్షాయై నమః
ఓం దక్షాధ్వరవినాశిన్యై నమః
ఓం సర్వార్థదాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సదాశివకుటుంబిన్యై నమః
ఓం నిత్యసుందరసర్వాంగ్యై నమః
ఓం సచ్చిదానందలక్షణాయై నమః
|| ఇతి శ్రీ అన్నపూర్ణా అశోత్తర శతనామావళి సమాప్తం ||


Also Read: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద


Also Read: పార్వతి ముచ్చటపడిందని చంద్రుడిని తీసి అలంకరించిన శివుడు, నవదుర్గల్లో మూడవది చంద్రఘంట