నలో చాలా మందికి ముక్కు నుంచి రక్తం కారడం చూస్తూనే ఉంటారు. శరీరంలో బాగా వేడి ఉండటం వల్ల అలా అవుతుందని కొందరు అంటే ముక్కు అదరడం వల్ల అలా జరిగిందని మరికొందరు చెప్తూ ఉంటారు. ఇలా ముక్కు నుంచి రక్తస్రావం సాధారణ విషయం అయినప్పటికీ దాన్ని అశ్రద్ధ చెయ్యకూడదు. ఇలా జరుగుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఎక్కువగా ముక్కు నుంచి రక్తస్రావం సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు. ఇది అంతర్లీన సమస్య అయినప్పటికీ ఇలా జరిగినప్పుడు భయపడకుండా ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి నయం చేసుకోవచ్చు.


అసలు ముక్కలో నుంచి రక్తం రావడానికి కారణాలు


ముక్కు చాలా సున్నితమైనది. ముక్కు నిండా రక్తనాళాలు ఉంటాయి. ఎటువంటి చిన్న దెబ్బ తగిలినా అవి సులభంగా గాయపడిపోతాయి. తద్వారా రక్తస్రావం అవుతుంది. వాటిలో కొన్ని అత్యంత సాధారణ కారణాలు కొన్ని..


❂ ముక్కు మీద గట్టిగా ఒత్తిడి పడటం


❂ ముక్కు గట్టిగా చీదడం


❂ పొడి, చల్లని వాతావరణం వల్ల ముక్కు లోపల పగిలిపోతుంది


❂ ముక్కులో అలర్జీ, తుమ్ములు ఎక్కువగా రావడం


❂ సైనస్ సమస్య


రక్తస్రావాన్ని ఆపడం ఎలా? 


ముక్కు నుంచి రక్తం కారినప్పుడు వెంటనే భయపడకుండా ఉండాలి. ఎటువంటి వైద్య సహాయం లేకుండా ఇంట్లోనే దానికి చికిత్స చేసుకోవచ్చు. అది దశల వారీగా చెయ్యాలి.


స్టెప్ 1: మొదటి దశలో దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు కొద్దిగా పెట్రోలియం జెల్లీని ఉపయోగించాలి. చేతి గోర్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. అవి ఎక్కువగా ఉండటం వల్ల ముక్కు శుభ్రం చేసుకునేటప్పుడు గోర్లు తగులుతాయి. రోజంతా నీరు ఎక్కువగా తాగుతు ఉండాలి. శరీరం తేమగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నించాలి.


స్టెప్ 2: ముక్కు క్రింద మెత్తని భాగం గట్టిగా ఐదు నిమిషాల పాటు ఒత్తి పట్టుకోవాలి. రక్తస్రావం మొదలైన వెంటనే ఆ వ్యక్తిని నేలపై పడుకోబెట్టాలి. నోటితో ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలి. తలపై ఐస్ ప్యాక్ లేదా ఏదైనా చల్లగా ఉంచాలి.


స్టెప్ 3: ముక్కు గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ రక్తం గొంతులోకి వెళ్తుంది. అప్పుడు దాన్ని మింగకుండా ఊసేయాలి.


స్టెప్ 4: ఐదు నిమిషాల పాటు ముక్కు అదిమి పట్టుకునా రక్తస్రావం ఆగపోతే మరో ఐదు నిమిషాలు పట్టుకోవాలి. అప్పటికి ఆగకుండా నిరంతరంగా వస్తుంటే మాత్రం తప్పని సరిగా వైద్యులని సంప్రదించాలి.


ముక్కు నుంచి రక్తస్రావం అనేది ఒక సాధారణ సమస్య. ప్రాథమిక చికిత్సతోనే దీన్ని నయం చేసుకోవచ్చు. ఇది కొద్దిగా రక్తపోటుని పెంచుతుంది. రక్తం చూడగానే ఆందోళన చెందకుండా ధైర్యంగా చికిత్స చేసుకుంటే సరిపోతుంది. విటమిన్ ఈ క్యాప్సూల్స్ లో ఉన్న ఆయిల్ ని ముక్కు లోపల దూది సహాయంతో అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా రక్తస్రావం ఆగుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?


Also read: మెరిసే జుట్టు కోసం కాఫీ ప్యాక్స్- సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు