గత కొంత కాలంగా నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై అధికార యంత్రాంగం ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో సౌకర్యాలు, వాటి పనితీరుపై అధికారులు ఆరా తీస్తున్నారు. అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా 18 బృందాలు ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నాయి. వీటిలో 3 బృందాలను కలెక్టర్ నియమించగా మిగతా బృందాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్యారోగ్యశాఖ అధికారులు నియమించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సౌకర్యాలు, అందిస్తున్న సేవలపై ఆరాతీస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆస్పత్రులకు నోటీసులు జారీ చేస్తున్నారు.
జిల్లాలో 250 వరకు నర్సింగ్ హోమ్ లు, ప్రైవేట్ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్లు ఉన్నాయి. వీటిలో కొన్నింటికీ పూర్తిస్థాయి రిజిస్ట్రే షన్ ఉండగా మరికొన్నింటికి రిజిస్ట్రేషన్ సమయం ముగియడంతో రెన్యువల్ చేశారు. మరికొన్నింటికీ తాత్కాలిక అనుమతులు ఇచ్చారు. జిల్లాలో అనుమతులు ఇచ్చిన హాస్పిటల్స్, ల్యాబ్ లో కనీస వసతులను కల్పించడంతోపాటు శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అనుమతులు ఉన్న వాటికే వైద్యసేవలు అందించాలని రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆయా ఆసుపత్రులకు నిబంధనలను వివరించారు. జిల్లాలోని ప్రైవేట్ వర్కింగ్ హోమ్ అనుమతులు కొన్నిరకాల వైద్యసేవలకే తీసుకుంటున్నా... స్పెషలిస్ట్ వైద్యులు లేకున్నా పలు రకాల సేవలను అందిస్తున్నారు. ల్యాబ్ నిర్వహణ సక్రమంగా లేకున్నా..... బయట నుంచి టెక్నిషియన్లను పిలిపిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోగుల అవసరం మేరకు స్పెషలిస్టులను కన్సల్టెంట్ బేస్ గా తీసుకువచ్చి వైద్యసేవలు అందిస్తున్నారని అధికారులు గుర్తించారు.
అనుమతి లేకుండా నిర్వహణ
హస్పిటల్స్‌కు ఎలాంటి అనుమతులు, రిజిస్ట్రేషన్ లేకున్నా మేనేజ్ చేస్తున్న రెండు అసుపత్రులకు నోటీసులు జారీచేశాయి. వైద్యులు లేకుండానే వైద్య సేవలు అందిస్తుండడంతో ఈ రెండు ఆసుపత్రులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని 19 ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులను జారీచేశారు. మరి కొన్ని హాస్పిటల్స్ కు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. జిల్లాలో కొన్ని సర్సింగ్ హోమ్ లు మినహాయిస్తే మిగితా వాటిలో వైద్యులతోపాటు నర్సింగ్ స్టాప్ ల్యాబ్ సిబ్బంది లేనట్లు గుర్తించారు అధికారులు. ఇష్టారీతిలో రోగుల నుంచి బిల్లులు వసూళ్లు, రోగులకు సంబంధించిన వివరాలు లేకపోవటం వాటిపై అధికారులు దృష్టి సారించారు. కనీస మౌలిక వసతులు లేని ఆసుపత్రుకు నోటీసుల జారీ చేశారు.
జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో తనిఖీలు చేస్తున్నానుని ఇప్పటివరకు నిబంధనలు పాటించని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశామని డీఎంహెచో డాక్టర్ సుదర్శనం తెలిపారు. మరికొన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీచేశామని ఆయన తెలిపారు.
తెలంగాణలో సిజేరియన్లలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. సిజేరియన్లను అరికట్టాలని వైద్య మంత్రి హరీష్ రావు ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోతోంది. సిజేరియన్లను అరిక్టటేందుకు జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను హెచ్చరించినప్పటికీ సరైన పద్దతిలో చర్యలు తీసుకోవటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. ఓ వైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణుల కోసం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంచుతున్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రుల్లోకి వెళ్లటానికి కారణాలు, అక్కడ ఎక్కువగా సిజేరియన్లనే చేయటంపై జిల్లా వైద్య శాఖ తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయ్. తనిఖీల పేరుతో కొన్ని ఆస్పత్రుల్లో అధికారులు హడావుడి చేస్తున్నారని... పేరొందిన ఆస్పత్రులపై చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయ్. ఓ వైపు ఈ వ్యవహారంపై కలెక్టర్ నారయణ రెడ్డి సీరియస్ గా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా వైద్యాధికారులు పెడచెవిన పెడుతున్నట్లు ఆరోపనలు వస్తున్నాయ్. ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు నార్మల్ డెలవరీ అయ్యేందుకు వారికి యోగా, వ్యాయామం వంటి మెలుకువలను సైతం శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది నార్మల్ డెలివరీలు అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చేసరికి సీన్ రివర్స్ అవుతోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో 90 శాతం సిజేరియన్లకే వైద్యులు ప్రోత్సహిస్తున్నారని అసలు వాదన.