నాన్ వెజ్ ప్రియుల్లో కొంతమంది చేపలను తినడానికి ఇష్టపడరు. కానీ చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపలు తినడం వల్ల శరీరం సమతుల ఆహారం తీసుకున్నట్టు అవుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శక్తిని, బలాన్ని పెంచుతుంది. ముఖ్యంగా సాల్మన్, ట్రౌట్, మాకెరెల్, సార్డినెస్ వంటి చేపలు ఎక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి. వీటిని తింటే ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలో చేరుతాయి. చేపలు ఎందుకు తినాలో, వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి. 


1. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మనిషి శరీర అభివృద్ధికి అతి ముఖ్యమైనవి. ఇవి చాలా తక్కువ ఆహార పదార్థాల్లో లభిస్తాయి. ఇవి మానవ మెదడు, కంటి చూపుకు చాలా ముఖ్యం.


3. మనిషి మెదడులో ఎక్కువ భాగం బాల్యంలోనే అభివృద్ధి చెందుతుంది. వృద్ధాప్యం చేరువవుతున్ని కొద్దీ దాని పనితీరు బలహీనపడడం ప్రారంభమవుతుంది. అందుకే పిల్లలు, ముసలివారే ముఖ్యంగా చేపలను తినాలి. ఇందులోని పోషకాలు మెదడుకు సహకరిస్తాయి. చేపలలో ఉండే పోషకాహారం మెదడు శక్తిని, పనితీరును మెరుగుపరుస్తుంది.


4. చేపల్లో మన కండరాలకు బలాన్ని ఇచ్చే ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల కండరాల బలహీనత వల్ల ఇబ్బంది పడతారు. అలాగే క్రీడలు, వ్యాయామం చేసేవారికి ప్రోటీన్లు అవసరం. చేపల్లో ఉండే ప్రోటీన్ బలాన్ని ఇస్తుంది. కానీ శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేయదు. ఎంత తిన్నా మంచిదే. 


5. వయసు పెరిగే కొద్దీ కంటి చూపు బలహీనంగా మారుతుంది. ఆధునిక కాలంలో కంప్యూటర్ స్క్రీను, మొబైల్ చూసే వారి సంఖ్య అధికంగా ఉంది. ఇది కంటి చూపుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు తినడం వల్ల కంటి చూపు బలంగా మారుతుంది. 


6. గుండె కండరాలకు చేపలు ఎంతో మేలు చేస్తాయి. ఆ కండరాలు బలహీనమైనప్పుడే గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. గుండెకు మేలు చేసే PF ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చేపల్లో ఉంటాయి. ఇవి మీ గుండెకు బలాన్ని ఇస్తాయి.


7. పెరుగుదలకు చేపలు చాలా సహకరిస్తాయి. ఇవి జుట్టు మెరిసేలా మందంగా, దృఢంగా ఉండేలా చేస్తాయి. 


వారానికి కనీసం రెండు సార్లు చేపల కూర తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. చేపల వేపుడు కన్నా కూరను వండుకోవడం ఉత్తమం. ఎందుకంటే నూనెలో వేయించడం వల్ల ట్రాన్స్ ఫ్యాట్లు ఉత్పత్తి కావచ్చు. అదే పులుసుగా, కూరగా వండుకుంటే నీటిలో ఉడుకుతుంది. చేప ఉడికితే పోషక విలువ బయటికి పోవు. 



Also read: లాడా, ఇది టైప్ 1.5 డయాబెటిస్ - దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే











































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.