వేసవి వస్తూనే తనతో పాటూ కొన్ని సమస్యలను తెస్తుంది. అంటు వ్యాధుల గురించి పక్కన పెడితే సాధారణ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి విపరీతమైన చెమట పట్టడం. కొందరిలో చెమట మోతాదు మించకుండా ఉంటుంది. కానీ కొందరికీ మాత్రం చెమటలు ధారాల్లా కారుతాయి. మరికొందరిలో విపరీతమైన దుర్వాసన కూడా వస్తుంది. చెమటలు ధారల్లా కారేవారు అధిక నీటిని తీసుకోవాలి. లేకుంటే డీహైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. కాబట్టి ఇలాంటి వారు కొబ్బరి నీళ్లు, పండ్లు, నీళ్లు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇక దుర్వాసన వచ్చే వారికి మాత్రం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. 


వీరిలోనే ఎక్కువ
శరీర దుర్వాసన అధికంగా వచ్చే అవకాశం టీనేజీ నుంచి యుక్తవయసులో ఉన్న వారికి వరకు అధికం. అలాగే మధుమేహం వంటి రోగాలు ఉన్న వారిలోనూ ఎక్కువే. వీరు బయటికి వెళ్లే పనులు ఉన్నప్పుడు సాత్వికాహారం తీసుకోవాలి. కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. 


1. బిర్యానీలు, పులావులు, చికెన్, మటన్,  చేపల కూరల్లో మసాలా దట్టించి వండుతారు. ఇలాంటివి తినడం వల్ల నోరు కూడా వాసన వస్తుంది. ఆ మసాలా వాసనలు మన శ్వానలో, చర్మం మీద గంటల కొద్దీ ఉంటాయి. శరీరం నుంచి మరింతగా దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. 


2. ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు లేని ఆహారాన్ని ఊహించలేం. అయినా ఎర్రటి ఎండల్లో మాత్రం ఆఫీసులకు వెళ్లేప్పుడు ఇది అధికంగా వేసిన ఆహారాన్ని తినకూడదు. తక్కువ మొత్తంలోనే తినాలి. వెజ్ వంటకాలలో ఉల్లి, వెల్లుల్లిన చాలా తక్కువ మోతాదులో వేస్తారు. నాన్ వెజ్ లో మాత్రం వీటిని అధిక మోతాదులో వేస్తారు. కాబట్టి తక్కువగా తినడం మంచిది. ఈ వెల్లుల్లి, ఉల్లి వాసన చర్మం మీద ఉన్న బ్యాక్టిరియాతో కలిసి చెడు వాసన వచ్చేలా చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతలను కూడా పెంచేస్తాయి. 


3. మాంసాహారాన్ని అధికంగా తినేవారిలో కూడా శరీర దుర్వాసన వస్తుంది. మాంసాహార ప్రొటీన్లు శ్వాస ద్వారా బయటికి వచ్చి చర్మం మీద ఉన్న బ్యాక్టిరియాతో కలిపి చెడు వాసన వచ్చేలా చేస్తాయి. 


4. వెజిటేరియన్ వంటల్లో కాలీ ఫ్లవర్, క్యాబేజీల తినడం వల్ల కూడా శరీర దుర్వాసన పెరుగుతుంది.చెమట, గ్యాస్ సమస్యలు ఎక్కువవుతాయి. వాసన కూడా భరించరానిదిగా ఉంటుంది. 


Also read: డయాబెటిస్ రీడింగులు ఎంత మోతాదు దాటితే మందులు వేసుకోవడం ప్రారంభించాలి?


Also read: మ్యుటేషన్ చెందుతున్న జికా వైరస్, ఎప్పుడైనా ప్రపంచంపై విరుచుకుపడే అవకాశం, హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు