Mango Puree and Tasty Puri : మ్యాంగో ప్యూరీ, తెలంగాణ పూరీ.. ఈ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా? రెసిపీ చాలా సింపుల్

Summer Recipes : ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఫుడ్ కాంబినేషన్ పూరీ, మ్యాంగో ప్యూరీ. అసలు ఈ కాంబినేషన్ ఎప్పుడైనా తిన్నారంటూ తెగ వైరల్ అవుతున్న ఈ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

Telangana Combination Puri and Mnago Puree : మామిడిపండ్ల సీజన్​లో తెలంగాణలో కచ్చితంగా చేసుకునే కాంబినేషన్​లో పూరీ, మ్యాంగో ప్యూరీ ఒకటి. పైగా ఈ ఫుడ్ కాంబినేషన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయిపోతుంది. మరి మీరు ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే కచ్చితంగా ట్రై చేయండి. ఈ డిఫరెంట్ కాంబినేషన్ మీ టమ్మీకి మంచి రుచిని అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ కాంబినేషన్​ని సింపుల్​గా ఎలా చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు 

గోధుమ పిండి - 3 కప్పులు 

పాలు - 1 కప్పు

సాల్ట్ - తగినంత

పంచదార - అర కప్పు

నూనె - డీప్ ఫ్రైకి సరిపడ

మామిడి పండ్లు - 2 పెద్దవి

తయారీ విధానం

ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో మూడు కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకుని కలపాలి. అనంతరం ఓ టీస్పూన్ నూనె వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీరు వేసుకుంటూ ఈ పిండిని పూరి పిండిలా చేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల పిండి కలుపుకోవడం సులభం అవుతుంది. పైగా పొడిగా కాకుండా ఉంటుంది. పూరి కోసం పిండిని స్మూత్​గా కలుపుకోవడం చాలా ముఖ్యం. ఇలా కలుపుకున్న పిండిని.. మూత వేసి ఓ పావు గంట పక్కన పెట్టుకోవాలి. 

ఇప్పుడు రెండు పెద్ద మామిడిపండ్లు తీసుకుని.. పైన తొక్కను తీసేయండి. చెక్కు తీసేసిన తర్వాత మామిడి టెంక నుంచి గుజ్జును వేరు చేయాలి. ముక్కలుగా కోసేయాలి. ఈ మామిడి ముక్కలను మిక్సీ జార్​లోకి తీసుకోవాలి. దానిలో పాలు, పంచదార వేసుకుని మూతపెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో నీరు వేయకూడదు. మామిడి ప్యూరీగానే ఉండాలి. దీనిని ఓ బౌల్​లోకి తీసుకోండి. దీనిని పక్కన పెట్టుకుండి.
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో డీప్​ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. అది వేడి అయ్యే లోపు గోధుమపిండి ముద్దను తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వాటితో పూరీలు చేయాలి.

పూరీలు చిన్న సైజ్​ కావాలంటే చిన్న సైజ్.. పెద్దగా కావాలంటే పెద్ద సైజ్​లో చేసుకోవచ్చు. అయితే మీరు అన్ని పూరీలు ఒకేసారి చేసి.. నూనెలో వేయించుకోవచ్చు. లేదంటే పూరీని చేస్తూ.. ర్యాండమ్​గా నూనెలు వేయించుకోవచ్చు. పూరీలను నూనెలో వేసి.. అది వేగుతున్నప్పుడు పైనుంచి గరిటతో ఒత్తితే పూరీలు బాగా పొంగుతాయి. ఇలా ఫ్రై అయిన పూరీలను నూనె నుంచి బయటకు తీసి.. మిగిలిన పూరీలను అదే మాదిరిగా వేయించుకోవాలి. అంతే టేస్టీ మ్యాంగో ప్యూరీ.. బెస్ట్ కాంబినేషన్​గా ఉండే పూరీలు రెడీ.

సమ్మర్​లో ఈ డిఫరెంట్ కాంబినేషన్​ కచ్చితంగా ట్రై చేయాలి అంటున్నారు ఫుడ్డీస్. ఎందుకంటే మొదటి రెండు బైట్స్ కాస్త వెరైటీగా ఉన్నా.. ఈ కాంబినేషన్​ తర్వాత నుంచి మీ ఫేవరెట్ అవుతుంది అంటున్నారు. ఈ కాంబినేషన్ మీరు బయట ట్రై చేయడం కన్నా.. ఇంట్లో ట్రే చేస్తే మంచిది. పైగా దీనిని సింపుల్​గా తయారు చేసుకోవచ్చు కూడా. మామిడి పండ్ల సీజన్ అయ్యేలోపే ఈ కాంబినేషన్​ ట్రై చేసేయండి మరి. 

Also Read : టేస్టీ, క్రంచీ ఓట్స్ వడలు.. నూనె పీల్చుకోకుండా ఉండాలటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Continues below advertisement
Sponsored Links by Taboola