Season of Low Appraisals : ఏప్రిల్ నెల రాగానే ఉద్యోగలందరీలో ఓ చిన్న అలజడి. ఆర్సీబీ స్లోగాన్ ఈ సాలా కప్ నామ్​దే లాగా.. ఈసారి ప్రమోషన్ నాదే అనే స్లోగాన్ ఎక్కువగా వినిపిస్తుంది. ఆర్సీబీ కప్ కోసం ఎలా ప్రయత్నిస్తుందో.. అలాగే ప్రతి ఉద్యోగి కూడా విరాట్ కోహ్లీ రేంజ్​లో ప్రమోషన్​ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. వారికి కప్ ఎలా దూరమవుతుందో.. అలా ఒక్క అడుగు దూరంలోనే ప్రమోషన్​కు బ్రేక్​లు పడిపోతుంటాయి. కంపెనీలు నెక్స్ట్ సాలా ప్రమోషన్ మీదే అనేస్తుంటాయి. దీంతో ఈ ప్రమోషన్​లు కొందరికి అందని ద్రాక్షలాగే మారుతున్నాయి. ఈ పరిస్థితులనుంచే ఓ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే డ్రై ప్రమోషన్(Dry Promotion).


ఆశలను అడియాశలు చేస్తోన్న డ్రై ప్రమోషన్


డ్రై ప్రమోషన్ (Dry Promotion Meaning) అర్థమేమిటంటే.. మీకు ప్రమోషన్ వస్తుంది. కానీ మీ ఎమోషన్​ పెంచే మనీ రాదు. అంటే ఉద్యోగిగా మీకు మంచి గుర్తింపు వస్తుంది. పదోన్నతి లభిస్తుంది. బాధ్యతలు కూడా పెరుగుతాయి. కానీ జీతం మాత్రం పెరగదు. దీనినే డ్రై ప్రమోషన్ అంటారు. సంవత్సరాల కొద్ది శాలరీలు పెరుగుతాయనే ఆశతో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ డ్రై ప్రమోషన్ అనేది ఆందోళన కలిగించే విషయం. ఆఫీస్​లలో కొత్త పోకడలు, వివిధ అంశాలపై ఉద్యోగులు జ్ఞానం సంపాదించడమనేది ఆఫీస్ అభివృద్ధిని సూచిస్తుంది. ఈ అభివృద్ధిలో భాగంగానే ఉద్యోగులు కూడా కొన్ని ఆశలు పెట్టుకుంటారు. కానీ వారి ఆశలను అడియాశలు చేస్తోందట డ్రై ప్రమోషన్. ఇది ఉద్యోగుల విధేయతను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. వారిలో పని చేయాలన్నా ఉత్సాహం తగ్గిపోవడానికి, క్రియేటివ్​గా ఆలోచించలేకపోవడానికి కారణమవుతుందట. 


పెరుగుతున్న డ్రై ప్రమోషన్​ రేటు


జీతాల పెంపుదల లేకుండా ఉద్యోగ ప్రమోషన్​లు ఇవ్వడమనేది ఉద్యోగులలో ఆందోళనలను రేకెత్తిస్తుంది. ఉద్యోగుల ఆర్థిక శ్రేయస్సు, సంతృప్తి అనేది కనుమరుగైపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే జీతం పెంచకుండా.. ఉద్యోగికి పదోన్నతిని ఇస్తే.. వారికి బాధ్యతలు, పనిభారం ఎక్కువవుతాయి. దీనివల్ల కంపెనీ కోరుకున్న రిజల్ట్స్ రాకపోవచ్చు. ఈ డ్రై ప్రమోషన్ అనేది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కానీ.. ఎప్పటినుంచో ఉద్యోగులు ఎదుర్కొంటున్న అత్యంత ప్రధాన సమస్యల్లో ఇది మొదటిదిగా ఉంటుంది.  compensation consultant Pearl Meyer ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ డ్రై ప్రమోషన్ అనే ప్రక్రియ పెరుగుతుందట. 2018లో ఎనిమిది శాతంగా ఉంటే.. ప్రస్తుతం దీని శాతం 13కి పెరిగిందని తెలిపింది. గత సంవత్సరాలతో పోలిస్తే 2024లో ప్రమోషన్ సంబంధిత జీతాల పెరుగుదల బడ్జెట్​లో తగ్గింపును సూచిస్తుందని వెల్లడించింది. 


ఉద్యోగి విధేయతపై ప్రభావం


డ్రై ప్రమోషన్ల వల్ల కేవలం ఆర్థికపరమైన చిక్కులే కాదు.. ఉద్యోగి నైతికత, విధేయతపై తీవ్రప్రభావం చూపిస్తాయట. దీనివల్ల ఉద్యోగులు అసంతృప్తిగా, నిరాదరణకు గురవుతారట. ఇది క్రమంగా ఉత్పాదకత తగ్గడానికి దారి తీస్తుంది. అంతేకాకుండా జీతాలు సరిగ్గా పెంచకుంటే.. అది సంస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు నిపుణులు. దీనివల్ల చాలామంది Brand new Designation వద్దు అంటూ..  Brand new Resignation చేసి జాబ్స్ వదిలి.. ఇతర సంస్థలకు వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ.. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చాలామంది జాబ్స్ స్విచ్​ అవుతున్నారు. 


Also Read : ప్రాణాలను హరించే దోమకాటు.. అందుకే మలేరియా డే రోజు కొత్త థీమ్​తో ముందుకు వస్తున్న WHO