Income from Instagram : ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఇవి ఫాలో అయిపోండి
ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు సంపాదించాలనుకుంటే ముందుగా మీ ప్రొఫైల్‌ను ప్రొఫెషనల్‌గా మార్చుకోవాలి. మీ కంటెంట్‌కి తగిన అంశాన్ని ఎంచుకుని ప్రొఫెషనల్‌కి మార్చుకోవచ్చు.
డ్యాన్స్, ట్రావెల్ వ్లాగ్స్, ఫుడ్, మోటీవేషనల్ వంటివి సోషల్ మీడియాలో ట్రెండ్‌లో ఉంటాయి. కాబట్టి మీరు ఆ అంశాలకు అనుగుణంగా మీ కంటెంట్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
మీరు ఏ పోస్ట్ చేసినా.. దానికి సరైన హ్యాష్‌ట్యాగ్ ఉంచేలా చూసుకోండి. దీనివల్ల రీచ్ ఎక్కువగా ఉంటుంది. సెర్చ్‌లో మీ కంటెంట్ వచ్చే అవకాశముంది.
అంతేకాకుండా మీ కంటెంట్ ఎక్కువమందికి చేరేందుకు మీరు ఇతరులను లేదా కంటెంట్‌కి సింక్ అయ్యేవారిని ట్యాగ్ చేయవచ్చు. లేదంటే మీ ఫ్రెండ్స్‌ని మీ పోస్ట్‌లు షేర్ చేయమనండి.
కామెంట్లు పోస్ట్ చేయడం, ఇతరులను ఫాలో అవ్వడం వల్ల కూడా మీ ప్రొఫైల్‌కు ట్రాఫిక్ పెరుగుతుంది. మీ పేజ్ రేంజ్ పెంచుకోవడానికి మీరు గేమ్స్ లేదా ఇతర టాస్క్‌లను నిర్వహించవచ్చు.
ఇలా మీరు ఫాలోవర్స్‌ని ఎంగేజ్ చేస్తూ.. ఫాలోవర్ కౌంట్‌ని పెంచుకుంటే బ్రాండ్స్ లేదా ఇతరులు మిమ్మల్ని ప్రమోషన్స్కోసం కనెక్ట్ అవుతారు.
ప్రమోషన్స్ ద్వారా మీ డబ్బు సంపాదించుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మీరు యాక్టివ్‌గా ఉండే దానిని బట్టి వీడియోలకు బోనస్‌లు కూడా ఇస్తుంది.