Turmeric Milk Face Pack : పాలల్లో పసుపు కలిపి ముఖానికి అప్లై చేస్తే కలిగే లాభాలివే.. సమ్మర్ స్కిన్ కేర్ టిప్స్
పాలల్లో పసుపు కలిపి ముఖానికి మాస్క్‌గా వేస్తే చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. ఇంతకీ ఈ మాస్క్ వల్ల కలిగే లాభాలేంటో చూసేద్దాం.
పాలల్లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మంపై పేరుకు పోయిన డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించడంలో హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ముఖానికి తేమను అందించి మృదువుగా చేస్తుంది.
పాలల్లోని ప్రోటీన్లు, విటమిన్లు చర్మానికి పోషణను అందిస్తాయి. దీనివల్ల చర్మానికి మంచి ప్రయోజనాలు అందుతాయి.
పాలల్లో పసుపు కలిపి రోజూ మసాజ్ చేయడం వల్ల చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. సమ్మర్ ట్యాన్ దూరమవుతుంది.
పసుపులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. సమ్మర్లో చర్మానికి వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
మొటిమలను తగ్గించడంలో, రాకుండా కాపాడడంలో పసుపు మంచి ప్రయోజనాలు అందిస్తుంది. పసుపులోని కర్కుమిన్ చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.