న్యూయార్క్‌కు చెందిన ఫ్యాషన్ షోలో జరిగిన సంఘటన ఇది. జరిగి 20 వారాలకు పైగానే అయింది. కానీ ఇప్పుడు వైరల్ గా మారింది. టిక్ టాక్‌లో దాదాపు 20 మిలియన్ల మంది వీక్షించారు. ఇప్పుడు ఈ వీడియో ఫ్యాషన్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఆ మోడల్ ఎవరో ఆరాలు తీస్తూ, ఆమెకు అవకాశాలు ఇవ్వద్దంటూ ప్రచారం కూడా జరుగుతోంది.  ఆ మోడల్ పేరు ‘థియోడోరా క్విన్లివన్’. ముద్దుగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో టెడ్డీ అని పిలుచుకుంటారు. కొన్ని వారాల క్రితం ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ లో లావెండర్, నలుపు కలగలిసిన జాకెట్, స్కర్ట్ వేసుకుని చేతిలో పెద్ద కోటుతో ర్యాంప్ వాక్ చేసేందుకు వచ్చింది. ఆడియెన్స్ ఆమె ఫోటోలను ఫోన్లలో బంధిస్తుంటే, ర్యాంప్ వాక్ చేస్తున్న ఆమె వారి దగ్గర ఆగి తన చేతిలో ఉన్న కోటుతో వారిని కొట్టింది. ఆ ఘటన అక్కడున్న వారందరినీ షాక్ కు గురిచేసింది.  చాలా రోజుల తరువాత ఫ్యాషన్ డిజైనర్ క్రిస్టియన్ కొవెన్ తన ఇన్ స్టా పేజీలో ఆ వీడియోను పోస్టు చేయగానే అది వైరల్‌గా మారింది. టిక్ టాక్‌లో కూడా చాలా మందికి చేరింది. 


అందుకేనా కొట్టింది?
ఆమె ఎందుకిలా చేసిందో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. కొంతమంది ఆమెకు పీరియడ్స్ కావచ్చు అని కామెంట్లు చేశారు. ఆ సమయంలో కోపం, అసహనం అధికంగా ఉంటాయి ఆడవాళ్లలో, అందుకని అలా కామెంట్ చేశారు. కానీ ఆమె సాధారణ మహిళ కాదు, ట్రాన్స్ ఉమెన్. 2019లో లేడీ మోడల్‌గా మారింది. ఇప్పుడు న్యూయార్క్‌లో ఉన్న టాప్ మోడళ్లలో ఈమె కూడా ఒకరు. ప్రస్తుతం ఆమె వయసు 27ఏళ్లు. న్యూయార్క్ సిటీలో నివసిస్తోంది. 






Also read:  బాహుబలిని మించేలా ఐరన్ మ్యాన్ థాలి... తింటే రూ.8.50 లక్షలు మీ సొంతం