'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు విడుదల అవుతోంది? అంటే... మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న అని అనుకుంటున్నారా!? సంక్రాంతికి విడుదల కావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడిన తర్వాత ఆ రెండు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేస్తామని 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందం ప్రకటించింది కాబట్టి ఆ తేదీల్లో విడుదల అవుతుందని అనుకుంటున్నారా!? లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే... 'ఆర్ఆర్ఆర్' ఆ రెండు తేదీల్లో విడుదల కావడం లేదు.


అవును... 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ మరోసారి మారింది. మొన్నామధ్య ప్రకటించినట్టు మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం లేదు. మార్చి 25న సినిమాను విడుదల చేస్తున్నట్టు ఈ రోజు ప్రకటించారు. ఒక్క 'ఆర్ఆర్ఆర్' మాత్రమే కాదు... పెద్ద సినిమాల విడుదల తేదీలు అన్నీ మారతాయని తెలుస్తోంది. 


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్, రామ్ చరణ్‌కు జోడీగా ఆలియా భట్, ప్రధాన పాత్రల్లో అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ నటించారు. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ (NTR), అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ (Ram Charan) నటించిన సంగతి తెలిసిందే. 






పది రోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్' బృందం చేసిన ప్రకటన: