మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. సంక్రాంతికి విడుదలైన 'రౌడీ బాయ్స్' సినిమాలో హీరోయిన్ గా కనిపించింది అనుపమ. ఈ సినిమాలో ఆమె లిప్ లాక్ సీన్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంటిమేట్ సీన్స్ లో కూడా కనిపించి షాకిచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమా కోసం అనుపమకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చారని సమాచారం.
ఇదిలా ఉండగా.. ఈరోజు అనుపమ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోల్లో అనుపమ గర్భవతిగా కనిపిస్తోంది. తన తండ్రితో కలిసి కొన్ని ఫొటోలు దిగింది. పాపిడిలో కుంకుమ, నైటీ వేసుకొని సాధారణ గృహిణిగా కనిపించింది అనుపమ. 'మనియారాయిలే అశోకన్' అనే సినిమా షూటింగ్ సమయంలో ఈ ఫొటోలు తీసుకున్నట్లు చెప్పింది ఈ బ్యూటీ.
అయితే ఈ ఫొటో చూసిన లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్.. 'బేబ్ నేను ఇంకా సీరియస్ గా కంగ్రాట్స్ అని టైప్ చేయబోయా..' అంటూ ఫన్నీగా కామెంట్ చేసింది. 'ఇదంతా ఎప్పుడు జరిగింది' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. ఇక అనుపమ సినిమాల విషయానికొస్తే.. నిఖిల్ తో కలిసి '18 పేజెస్', 'కార్తికేయ 2' వంటి సినిమాల్లో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.