వరుణ్ ధావన్... బాలీవుడ్ యంగ్ హీరో. అతను ఇటీవల ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు చెప్పాడు. ఆ సమస్య పేరు ‘వెస్టిబ్యులర్ హైపో ఫంక్షన్’. ఇది చెవి లోపలి భాగంలో వచ్చే ఒక అసమతుల్యత. దీని వల్ల సాధారణ జీవితం కాస్త తలకిందులు అవుతుంది. సమస్య చిన్నగా కనిపించినా దాన్ని భరించడం మాత్రం కష్టంగానే ఉంటుంది. తాను ఆరోగ్యాన్ని విస్మరించి అధికంగా పనిచేయడం వల్ల ఈ సమస్య కలిగిందని చెప్పుకొచ్చాడు హీరో. అధికంగా పనిచేయడం వల్ల ఒత్తిడి విపరీతంగా కలిగింది. ఆ ఒత్తిడి కారణంగా ఈ చెవిలోపలి భాగంలో పనితీరు దెబ్బతిని అసమతుల్యత కలిగినట్టు వైద్యులు నిర్ధారించారు. 


వెస్టిబ్యులర్ హైపోఫంక్షన్ అంటే ఏమిటి?
మన చెవిలో బ్యాలెన్స్ సిస్టమ్ ఉంటుంది. దీనిలోని అంతర్గత భాగం సరిగ్గా పనిచేయనప్పుడు, ఆగిపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. వెస్టిబ్యులర్ సిస్టమ్ అనేది చాలా ముఖ్యంమైనది. అది మిమ్మల్ని స్థిరంగా ఉంచేందుకు సహకరిస్తుంది.  కళ్ళు,  కండరాల సమన్వయంలో కలిసి పని చేస్తుంది. ఈ వ్యవస్థ సరిగా పనిచేయనప్పుడు వెంటనే మెదడుకు ఆ సందేశాన్ని పంపుతుంది. అప్పుడు మనకు మైకం కలగడం, కళ్లు తిరుగుతున్నట్టు అవ్వడం, వికారం వంటివి కలుగుతాయి. 


ఎలా వస్తుంది?
ఒక బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇది లోపలి చెవి భాగంపై లేదా మొత్తం నరాల మీదే దాడి చేస్తుంది. ఈ బ్యాక్టిరియా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో అధిక ఒత్తిడి కూడా కారణం. అలాగే ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. 
1. లోపలి చెవి నిర్మాణం బలహీనంగా ఉండడం
2. చెవి లోపల గాయం తగలడం
3. కొన్ని రకాల మందులు వాడడం 
4. తీవ్ర ఆందోళన, ఒత్తిడి బారిన పడడం
5. చెవిలో రక్తం గడ్డకట్టడం
6. మెదడుకు గాయం తగలడం
7. చెవిలోంచి స్రావాలు కారడం
8. వయసు పెరగడం


లక్షణాలు ఎలా ఉంటాయి?
1. వెర్టిగో వల్ల తీవ్రంగా తల తిరుగుతుంది. 
2. మైకం, వికారం ఎక్కువవుతంది. 
3. సరిగ నడవలేరు
4. వినికిడి తగ్గుతుంది. 
5. చూపు మసకబారుతుంది
6. చెవిలోంచి కాల్ఫియం పొడి బయటికి రావడం


ఆడియోమెట్రీ లేదా వినికిడి పరీక్ష చేయడం ద్వారా, రక్త పరీక్షల ద్వారా, సీటీస్కాన్, పోస్టరోగ్రఫీ పరీక్షలు చేయడం ద్వారా ఈ ఆరోగ్యసమస్యలను నిర్ధారిస్తారు. 


చికిత్స ఎలా చేస్తారు?
ఈ ఆరోగ్య పరిస్థితికి అసలు కారణం ఏమిటో తెలుసుకుని వైద్యులు మందులను సూచిస్తారు. యాంటీబయాటిక్స్, యాంటీ ఫంగల్ చికిత్సలు అవసరం కావచ్చు. అలాగే బిగ్గరగా పాటలు పెట్టుకోవడం, శబ్ధ కాలుష్యానికి దూరంగా ఉండమని చెబుతారు. మద్యం మానేయమని సూచిస్తారు. శస్త్రచికిత్స అవసరమైతే అది కూడా చేస్తారు. ఒత్తిడి తగ్గించుకోకపోతే ఇది ఎవరికైనా రావచ్చు. 


Also read: రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఈ సూపర్ ఫుడ్స్ మెనూలో ఉండేట్టు చూసుకోండి









గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.