ప్రపంచంలో మహిళలకు వస్తున్న క్యాన్సర్లలో ప్రధానమైనది రొమ్ము క్యాన్సర్. ఇది రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎవరికి వస్తుందో చెప్పడం కూడా కష్టం. వారసత్వంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే చెడు జీవనశైలి కారణంగా కూడా రావచ్చు.కాబట్టి రాకుండా ముందే ఆహార పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి.  


ఆకుపచ్చని కూరగాయలు
పాలకూర, చుక్కకూర, గోంగూర, బ్రకోలీ, బచ్చలి కూర, ఆకుపచ్చని రంగు కూరగాయలు  అధికంగా తీసుకోవాలి. వీటిలో ఏదో ఒకటి రోజూ తింటే మంచిది. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్లను బయటికి పంపేందుకు సహకరిస్తాయి. అలాగే ఫొలేట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకునే శక్తి కూడా దీనికి ఉంది. కాలీ ఫ్లవర్, క్యాబేజీలు కూడా ఆకుపచ్చని కూరగాయల కిందకే వస్తాయి. వీటిని తినడం చాలా అవసరం. 


ఉల్లిపాయలు
ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు, ఉల్లికాడలు వంటివి తరచూ అన్నంలో కలుపుకుని తింటూ ఉండాలి. పచ్చివి తిన్నా మంచిదే, వండినవి తిన్నా మంచిదే. కానీ రోజూ తినాలి.  ఇది రొమ్ముక్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. 


పసుపు
పసుపుకు మన వంటల్లో చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఆధునిక ఆహారాలైన పిజా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి వచ్చాక వీటి వాడకం తగ్గింది. పసుపు వేసిన ఆహారాలను తినాల్సిన అవసరం ఉంది. ఇందులో ఉండే కర్కుమిన్ దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇందులో యాంటీ బయోటిక్ గుణాలు అధికం. 


నిమ్మ, ఆరెంజ్
నిమ్మ రసం తాగడం, ఆరెంజ్, మోసంబి వంటి పండ్లు తినడం చేయాలి. ఇందులో విటమిన్ సి, ఫొలేట్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రొమ్ము  క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. వీటిలో యాంటీ క్సాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ద్రాక్షపండ్లలో కూడా ఈ గుణాలు ఉంటాయి. వాటిని కూడా తినాలి. 


దానిమ్మ
దానిమ్మ పండును రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. దీనిలో ఉంటే ఫైటో కెమికల్ రొమ్ము క్యాన్సర్ నుంచి సరైన రక్షణ కల్పిస్తుంది. మధ్యాహ్నం భోజనం తిన్నాక సాయంత్రం ఐదు గంటల సమయంలో వీటిని స్నాక్స్‌లా తింటే మంచిది. 


బెర్రీ పండ్లు
బెర్రీ జాతి పండ్లు ఎన్నోరకాలు ఉన్నాయి. అందులో స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు మనకు దొరుకుతాయి. వాటిలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు అధికంగా ఉన్నాయి. అవి సహజంగా రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇనఫ్లమ్మేటరీ గుణాలు అధికం. కాబట్టి రోజులో రెండు స్ట్రాబెర్రీలు, నాలుగు బ్లూబెర్రీలు తిన్నా చాలు. 


చేపలు
చేపల్లోని కొవ్వు చాలా ఆరోగ్యకరం. అందులో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అందుకే కొవ్వు పట్టిన చేపలు కనిపిస్తే కొనుక్కుని వండుకుని తినండి. ముఖ్యంగా సాల్మాన్, సార్డినెస్ వంటి కొవ్వు చేపలు తింటే మరీ మంచిది. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి కూడా. రొమ్ము క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. 


Also read: మూడున్నరకోట్ల విలువైన ఇల్లు, రూ.277కే ఇచ్చేస్తారట, మీరు చేయాల్సిందల్లా ఇదే








గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.