ఆ ఇంటిని చూస్తే కళ్లు చెదిరిపోతాయ్. విలాసవంతమైన భవనం. నాలుగు బెడ్రూమ్‌లు, పెద్ద కిచెన్, లివింగ్ రూమ్, గార్డెన్... చూడచక్కని ఇల్లు. ఈ ఇంటిని సొంతం చేసుకోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. అదృష్టం కలిసొస్తే చాలు. జస్ట్ రూ.277 రూపాయలతో ఈ ఇంటిని దక్కించుకోవచ్చు. దీనిని సాధారణంగా కొనాలంటే దాదాపు రూ3.7 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ ఆ ఇంటిని లాటరీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నారు ఆ ఇంటి యజమానులు. ఇందుకు టిక్కెట్ ధర రూ.277గా నిర్ణయించారు. ఆ ఇంటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది టిక్కెట్లు కొంటున్నారు. 


ఎక్కడ?
ఇంతకీ ఈ ఇల్లు ఎక్కడ ఉంది అని ఆలోచిస్తున్నారా? మన దేశంలో కాదు  బ్రిటన్లో. ఆ దేశంలోని కెంట్ ప్రాంతంలో ఈ ఇల్లు ఉంది. రైల్వేస్టేషన్ కు దగ్గర్లోనే ఈ ఇల్లు ఉంది. రైలు స్టేషన్‌కు సమీపంలో ఉంది. ఇప్పటికే ఎంతో మంది లాటరీలు టిక్కెట్లు కొనేస్తారు. ఈ లాటరీ వేస్తున్నది ‘ట్వెన్‌ఫోర్’ సోదరులు. వీరు గతంలో కూడా ఇలా నాలుగు ఇల్లు లాటరీ ద్వారా అమ్మారు. వారు ఇంతకుముందు నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన మూడు అపార్ట్ మెంట్లను లాటరీల త్వారా అందించారు. కొనుక్కున్న వారు ఆ ఇంటిని ఏమైనా చేసుకునే హక్కును రాసిచ్చారు.  






అయితే ఈ లాటరీ వేయాలంటే దాదాపు లక్షా యాభై అయిద వేల టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది. అన్ని టిక్కెట్లు విక్రయిస్తేనే స్టాంప్ డ్యూటీ, లీగల్ ఫీజులు వంటివి బదిలీ చేయడం కుదురుతుంది. ఈ అన్నదమ్ములు ‘ట్రామ్ వే పాత్’ పేరుతో తమ వ్యాపారం కింద ఆస్తులను రాఫిల్ చేశారు. రాఫిల్ అంటే ఇలా టిక్కెట్లు విక్రయించడం ద్వారా డబ్బును సంపాదించడం అని అర్థం. వాటిలో డ్రాలు తీయడం ద్వారా విజేతలకు బహుమతి అందజేస్తారు. ట్వెన్‌ఫోర్ సోదరులకు లాక్ డౌన్ సమయంలో ఈ ఆలోచన వచ్చింది. తమ సొంత ఆస్తిని తొలిసారి వారు ఇలా అమ్మారు. తరువాత కొంతమంది తమ ఆస్తులను అలా అమ్మమని అడగడంతో అలా చేయడం ప్రారంభించారు. లాటరీ విజేతల్లో పేదవారు కూడా ఉన్నారు. వారు ఇల్లును సొంతం చేసుకున్నప్పుడు చాలా ఆనందమేసేదని చెబుతున్నారు అన్నదమ్ములు. ఈ ఇంటి డ్రా న్యాయవాది సమక్షంలోనే చేపడతారు. అంతా పకడ్బందీగా, నియమాల ప్రకారం సాగుతుంది.  ఇప్పటికే బ్రిటన్లో వీరి పనితీరు ఎంతో మందిని ఆకర్షించింది. అందుకే లాటరీ టిక్కెట్లు కొనేవారి సంఖ్యం కూడా పెరిగిపోయింది.


Also read: ఈ స్వీట్ తింటే మగవారిలో ఉన్న ఆ సమస్య దూరం, ఇంకా ఎన్నో లాభాలు