ఇంజినీరింగ్ కాలేజీలను తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) హెచ్చరించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. జీవో నంబర్ 37 ప్రకారం అందులో సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని, ఏ ఇతర రూపాల్లోనూ డబ్బులు వసూలు చేయకూడదని కాలేజీలకు తేల్చి చెప్పింది.
ఒకవేళ అదనంగా ఫీజు వసూలు చేస్తే రూ.2 లక్షల జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. అది కూడా ఒక్కసారి కాకుండా ఎంతమంది విద్యార్థుల దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేస్తే అన్ని సార్లు రూ.2 లక్షలు కట్టించుకుంటామని ఆ కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా తీసుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.
తక్కువ మెరిట్ వాళ్లకిస్తే రూ.10 లక్షలు జరిమానా..
ఇంజినీరింగ్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ ఆధ్వర్యంలో విద్యాశాఖ సెక్రటరీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ఓయూ, జేఎన్టీయూ అధికారులతో సమావేశం నిర్వహించారు. బీ-కేటగిరీ సీట్ల కోసం ఏఎఫ్‌ఆర్‌సీ ద్వారా కాలేజీలకు తమ పేర్లను విద్యార్థులు పంపినా దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కమిటీ సీరియస్ అయ్యింది. అయితే వీరి కేసులు మెరిట్‌పై పరిగణించబడతయా లేదా? అన్న అనేది కమిటీ పరిశీలిస్తోంది. ఆ దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్‌పై పరిగణించకపోతే చర్యలు తీసుకోవడానికి కమిటీ చర్యలు తీసుకోనుంది. ఏఎఫ్‌ఆర్‌సీ ద్వారా దరఖాస్తులు ఫార్వార్డ్ చేయబడిన విద్యార్థుల మెరిట్ కంటే తక్కువ మెరిట్ ఉన్న విద్యార్థులకు సీటు ఇస్తే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ రెండు జరిమానాలును సంబంధిత కన్వీనర్ వద్ద ఉన్న నిధుల నుండి వసూలు చేయబడతాయి.
Also Read:
'గేట్-2023' దరఖాస్తుల్లో ఏమైనా తప్పులున్నాయా? సవరణ షెడ్యూలు ఇదే! ఇలా సరిచేసుకోండి!
గేట్-2023 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా తప్పులు దొర్లితే, సరిచేసుకోవడానికి ఐఐటీ కాన్పూర్ అవకాశం కల్పించింది. నవంబరు 8 నుంచి 14 వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. దరఖాస్తు గడువు ముగిసేలోపు అభ్యర్థులు సవరణ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..