తెలంగాణ రాష్ట్రంలో ఎడ్‌సెట్‌-2022(ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) తొలివిడత సీట్లను నవంబర్ 5న కేటాయించారు. కన్వీనర్ కోటాలో 14,285 బీఈడీ సీట్లు అందుబాటులో ఉండగా 10,053 మందికి సీట్లు దక్కాయని ఎడ్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య పి.రమేశ్ బాబు తెలిపారు. సీట్లు పొందినవారు నవంబర్ 11 లోపు కళాశాలల్లో చేరాలని, నవంబరు 14 నుంచి తరగతులు మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు.


Phase I Allotments - Collegewise List


Phase I Allotments - Candidate Login 


తెలంగాణలో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్‌సెట్‌ 2022-23 కౌన్సెలింగ్‌ అక్టోబరు 18న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అక్టోబరు 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. అక్టోబరు 26 నుంచి 28 వరకు స్పెషల్‌ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అనంతరం అక్టోబరు 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. అక్టోబరు 28 నుంచి 30 వరకు ఫేజ్‌-1 వెబ్‌ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. అక్టోబరు 31న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌‌కు అవకాశం కల్పించారు. నవంబర్‌ 5న సీట్లను కేటాయించారు.


ఈ ఏడాది ఈ ఏడాది టీఎస్‌ ఎడ్‌సెట్‌ పరీక్ష జూలై 26న టీఎస్‌ఎడ్‌సెట్-2022 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 26న ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 31,578 మంది హాజరుకాగా.. 30,580 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.



Also Read:


యూజీసీ నెట్-2022 ఫలితాలు వెల్లడి, రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!
యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ, అసిస్టెంట్‌ లెక్చర్‌షిప్‌ అర్హత కోసం నిర్వహించిన యూజీసీ నెట్‌ ఫలితాలు శనివారం (నవంబరు 5న) విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాలను విడుదల చేసింది. యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్‌తోపాటు, ఎన్టీఏ ఫలితాల వెబ్‌సైట్‌లో కూడా ఫలితాలను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు ఆయా వెబ్‌సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ అర్హత పరీక్షకు సంబంధించిన తుది కీని ఎన్‌టీఏ విడుదల చేసింది.
ఫలితాలు, కటాఫ్ మార్కుల వివరాల కోసం క్లిక్ చేయండి..


IICD Admissions: క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 
ప్రవేశ ప్రకటన, ఎంపిక వివరాల కోసం క్లిక్ చేయండి..



'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. 
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..