‘రోబో’ చిత్రంలో రజినీకాంత్.. అచ్చం తన పోలికలతో ఉండే చిట్టి(రోబోట్)ను తయారు చేస్తాడు. రూపమే కాకుండా.. దాని నడక, స్టైల్ కూడా రజినీ తరహాలోనే ఉంటుంది. మరి మీకు కూడా మీ పోలికలతో ఉండే రోబోట్‌ను చూడాలని ఉందా? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే, మీరు.. Promobot కంపెనీ గురించి తెలుసుకోవల్సిందే. కళ్లు తిరిగే మరో విషయం ఏమిటో తెలుసా? మీ ఫేస్‌ను ఆ రోబోట్లకు పెట్టేందుకు మీరు అనుమతి ఇస్తే.. ఆ సంస్థ రూ.2 కోట్లు చెల్లిస్తుంది. నమ్మబుద్ధి కావడం లేదా?


Promobot సంస్థ సరికొత్త టెక్నాలజీ ద్వారా మనుషులను పోలిన మనుషుల ముఖాలను తయారు చేస్తోంది. వాటిని ఆ సంస్థకు చెందిన రోబోట్లకు అమర్చుతున్నాయి. అయితే, వారికి ఫ్రెండ్లీగా కనిపించే ఫేస్‌లు కావాలి. ఈ సందర్భంగా ఆ కంపెనీకి కత్తిలాంటి ఐడియా వచ్చింది. ప్లెజంట్‌గా కనిపించే ఫేస్‌‌లను ఎంపిక చేసి.. వారి ముఖాల త్రీడీ ప్రింట్‌తో రోబోట్లకు ఫేస్‌లను తయారు చేస్తోంది. ఎవరైతే తమ రూపాన్ని రోబోట్‌లకు పెట్టే హక్కును సంస్థకు ఇస్తారో.. వారికి ఏకంగా రూ.2.10 కోట్లు చెల్లిస్తామని ఆ సంస్థ ప్రకటించడం గమనార్హం. 


ఈ సందర్భంగా 25 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. స్త్రీ, పురుషులు తమ ఫొటోలను, వీడియోలను వారికి పంపినట్లయితే.. వారికి నచ్చిన ఫేస్‌ను ఎంపిక చేసుకుంటారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న అత్యాధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా.. మనిషి చర్మాన్ని పోలే సింథటిక్ ఫేస్‌ను తయారు చేస్తారు. 2023 సంవత్సరంలో ఉత్తర అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాల్లోని హోటళ్లు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్స్‌లో ఈ రోబోట్ల సేవలను అందుబాటులోకి తేవాలనేది Promobot లక్ష్యం. ఈ రోబోట్లు కేవలం మనిషి రూపాన్నే కాదు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫేషియల్ రికగ్నిషన్, స్పీచ్, అటానమస్ నేవిగేషన్‌‌ను కూడా కలిగి ఉంటాయి. 


Also Read: కోవిడ్-19 కొత్త వేరియెంట్ ‘ఒమిక్రాన్’.. ఇది డేల్టా కంటే డేంజరా? లక్షణాలేమిటీ?


Promobot తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘‘2019 నుంచి మేము.. మానవరూప రోబోట్‌లను మార్కెట్లకు సరఫరా చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మా కొత్త క్లయింట్లు.. నిజమైన వ్యక్తుల పోలికల్లో ఉండే రోబోట్లు కావాలన్నారు. ఇందుకు చట్టపరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు దరఖాస్తులను ఆహ్వానించాం. ఎంపికయ్యే వ్యక్తి బాహ్య రూపాన్ని, వారి ముఖం, శరీరం 3D మోడల్ తీసుకోవాలి. ఆ తర్వాత వారి వాయిస్ కాపీ చేసి.. 100 గంటల స్పీచ్‌ మెటీరియల్‌ను ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత ఆ రోబోట్‌ను కస్టమర్లతో కమ్యునికేట్ చేసేలా సిద్ధం చేయాలి. ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యే దరఖాస్తుదారుడు.. తన రూపాన్ని మా సంస్థ ఉపయోగించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదనే విషయాన్ని తెలుపుతూ ఒప్పందంపై సంతకం చేయాలి’’ అని పేర్కొంది. మరి మీరు కూడా మీ రూపాన్ని రోబోట్‌‌లో చూసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఆ వారి వెబ్‌సైట్‌ను సంప్రదించండి. 



Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? 
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
Also Read: డేటింగ్, వన్ నైట్ స్టాండ్‌కు మధ్య తేడా ఏమిటీ? ఏది సేఫ్?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి