ఐపీఎల్ జట్లు రిటెన్షన్ జాబితాను ప్రకటించడానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో కేవలం కేన్ విలియమ్సన్‌ను మాత్రమే రిటైన్ చేస్తుందని, మిగతా వారందరినీ వదిలేయనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సన్‌రైజర్స్ చేసిన ట్వీట్ ఫ్యాన్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆ ట్వీట్‌ను కింద చూడండి.
ఈ ఫొటోకు క్యాప్షన్‌గా ‘గత కొద్ది సంవత్సరాలుగా సన్‌రైజర్స్‌కు మీరు అందించిన సేవలకు ధన్యవాదాలు. ఇది గుడ్‌బై కాకపోయినా.. వేలంలో కొంతమంది రైజర్స్‌ను తిరిగి దక్కించుకోగలం అని నమ్మకంతో ఉన్నాం.’ అని రైజర్స్ దీనికి క్యాప్షన్‌గా పెట్టింది. ఈ ఫొటోలో కేన్ విలియమ్సన్ కూడా ఉండటంతో ఇప్పుడు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కరిని కూడా రిటైన్ చేసుకోకుండా పూర్తి మొత్తంతో వేలంలోకి వెళ్తోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సన్‌రైజర్స్ కూడా ఆ బాటలో వెళ్తుందన్న భయం కూడా ఫ్యాన్స్‌ను వెంటాడుతోంది. ఇప్పుడు వేలంలోకి వదిలేసి అక్కడ తక్కువ ధరకి కొట్టేద్దాం అనే ప్లాన్‌లో సన్‌రైజర్స్ ఉందా అనే సంగతి కూడా తెలియరాలేదు.
అయితే ఒక్కసారి వదిలితే కొత్త ఫ్రాంచైజీలకు వెళ్లే అవకాశం ఉంది. అదే జరిగితే టాప్ ప్లేయర్లందరూ వివిధ జట్లలో ఉండిపోయి.. మిగిలిపోయిన ఆటగాళ్ల కోసం పోటీ పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టును చూసుకుంటే.. డేవిడ్ వార్నర్ ఎంత ఫాంలో ఉన్నా రిటైన్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే టాప్ క్లాస్ టీ20 ప్లేయర్‌ను అంత దారుణంగా ట్రీట్ చేశారు.
మిగతా వారిలో కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, బెయిర్ స్టో, నబీ వంటి బెస్ట్ ప్లేయర్లు ఉన్నారు. వీరిలో కేన్ విలియమ్సన్‌ను మాత్రమే రిటైన్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన క్లారిటీ రాత్రి 9:30 గంటలకు రానుంది. రషీద్, భువీ, బెయిర్‌స్టో వంటి ప్లేయర్లు వేలంలోకి వస్తారా.. కొత్త ఫ్రాంచైజీలు కొట్టేస్తాయా అనే క్లారిటీ కూడా డిసెంబర్‌లో వచ్చేస్తుంది.
Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్
Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!
Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి