యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనడం లేదంటూ కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని అడిగారు. ధాన్యం కొని రైతులను ఆదుకోనప్పుడు మరి కేసీఆర్ ఎందుకు ఉన్నట్టు అని ప్రశ్నించారు. పార్లమెంటు సమావేశాలకు హాజరైన ఎంపీ రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం మధ్యాహ్నం మాట్లాడారు.


‘‘వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా రైతు సమస్యలపై మాట్లాడాలని కాంగ్రెస్ సహా విపక్షాలు భావించాయి. ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన రైతులు, రైతులపై కేసులు, కనీస మద్ధతు ధర గురించి మాట్లాడే అవకాశం దొరికేది. కానీ సభను అడ్డుకుని, కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని రక్షించేందుకు టీఆర్ఎస్ ముందుకొచ్చింది. టీఆర్ఎస్ ఆందోళనతో చర్చ లేకుండానే వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఉభయ సభలు పాస్ చేశాయి. 


నిజంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే, లోక్‌సభలో ఉన్న 9 మంది ఎంపీల్లోనే ముగ్గురు సభకు ఎందుకు రాలేదు? వరి వేసుకున్న రైతులు ఉరేసుకునేలా రెండు పార్టీలు చేస్తున్నాయి. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు మేలు జరిగేలా చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనకపోవడంతో రైతులు కార్పొరేట్ శక్తుల వైపు వెళ్లక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి. ఆదానీ, అంబానీలకు రైతులు వారి పంటలను అమ్ముకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. దేశానికే అన్నపూర్ణ తెలంగాణ అని చెప్పిన సీఎం కేసీఆర్, వరి ధాన్యాన్నే కొనకుండా కూర్చున్నావు. వరితో పాటు ఏ పంటనూ కొనడం లేదు. 


కేంద్ర ప్రభుత్వం కొనడం లేదంటూ కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం కొననప్పుడే కదా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలి. కేంద్రం కొనకపోతే రాష్ట్రం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి కదా.. మరి కేసీఆర్ ఎందుకు ఉన్నట్టు.. దొంగలా దొరికిపోయావు కాబట్టే, కేంద్ర ప్రభుత్వం మెడపై కత్తిపెట్టిందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ‘మెడ మీద కత్తి’ అనే పదానికి అర్థం ఏంటో తెలంగాణ సమాజానికి చెప్పాలి. తెలంగాణ రైతులు పండించిన ధాన్యానికి కొననప్పుడు మీకు ముఖ్యమంత్రిగా ఉండే హక్కు మీకు ఉందా..? వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై మీకు అవగాహన ఉందా..?


Also Read: ధాన్యం ఎట్ల కొనవో చూస్తా బిడ్డా.. ఆ ఒప్పందాలేమైనా చేసుకుంటున్నవా? డౌట్ వస్తున్నది: బండి సంజయ్


‘‘గతంలో రైతులు వరికి బదులు మొక్కజొన్న, చెరకు, పత్తి పండిస్తే పండించవద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పప్పు దినుసులు పండిస్తే వాటికి సరైన గిట్టుబాటు ధర లేకుండా చేశారు. ఖమ్మం జిల్లాలో మిర్చి గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన చేస్తే వారికి బేడీలు వేయించారు. కేంద్ర ప్రభుత్వం కొన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలి కదా.. ప్రత్యామ్నాయ పంటలు వేసినప్పుడు వాటికి గిట్టుబాటు ధరతో పాటు రైతులకు సరైన వసతులు కల్పించాలి కదా? ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు నీకు తెలియదా..? నువ్వేమన్నా చిన్నపిల్లగాడివా?’’ అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.



Also Read: CM KCR: యాసంగిలో ధాన్యం సేకరణ ఉండదు... వర్షకాలం పంటను ఎంతైనా కొంటాం... సీఎం కేసీఆర్ కీలక ప్రకటన...


Also Read: TS Cabinet : ఒమిక్రాన్‌పై పోరుకు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ . ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి