కొత్తగా వచ్చిన లఖ్‌నవూ ఫ్రాంచైజీపై పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను కావాలనే లాగేసినట్టు ఆరోపించాయి. ఉద్దేశపూర్వకంగా తమ జట్టు కూర్పును దెబ్బతీసిందని వెల్లడించాయి. బీసీసీఐ సైతం సానుకూలంగానే స్పందించిందని సమాచారం.
ఐపీఎల్ రాబోయే సీజన్ల కోసం ఆటగాళ్లను అట్టిపెట్టుకొనేందుకు నేడే చివరి తేదీ. నేటి సాయంత్రం లోపు ఎవరెవరిని తీసుకుంటున్నారో ఆ జాబితాలను బీసీసీఐ సమర్పించాలి. ఇప్పటికే జట్లన్నీ జాబితాలను సిద్ధం చేశాయి. కాగా పంజాబ్ కింగ్స్ నుంచి కెప్టెన్ కేఎల్ రాహుల్, హైదరాబాద్ నుంచి రషీద్ ఖాన్ విడిపోతున్నట్టు తెలిసిందే. దురుద్దేశ పూర్వకంగా ఆటగాళ్లని కలిసి తమతో బంధం తెంచుకొనేలా చేసిందని లఖ్‌నవూపై ఆ రెండు జట్లు ఆరోపిస్తున్నాయి.
'అధికారికంగా మాకెలాంటి రాతపూర్వక ఫిర్యాదు అందలేదు. కానీ రెండు ఫ్రాంచైజీల నుంచి మౌఖికంగా ఫిర్యాదులు అందాయి. వారి ఆటగాళ్లను దురుద్దేశపూర్వకంగా లఖ్‌నవూ ఫ్రాంచైజీ కలిసిందని ఆరోపించాయి. ఈ విషయాన్ని మేం పరిశీలిస్తున్నాం. ఇది నిజమని తేలితే మేం సరైన చర్యలు తీసుకుంటాం' అని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ఐపీఎల్‌లో తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని బీసీసీఐ అధికారి అంటున్నారు. ఆటగాళ్లను కలవకుండా అడ్డుకోవడం కష్టమని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న జట్ల కూర్పు, సమతూకం దెబ్బతీయడం మాత్రం న్యాయం కాదని స్పష్టం చేస్తున్నారు. 'సమతూకం దెబ్బతీయాలని మేం కోరుకోవడం లేదు. తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు ఇలాంటివి తప్పవు. జట్ల కూర్పు దెబ్బతీయడం సరికాదు' అని ఆ అధికారి వెల్లడించారు.
Also Read: Sri Lankan Women Cricketers: శ్రీలంక క్రికెట్‌లో కలకలం... ఆరుగురు మహిళా ఆటగాళ్లకు పాజిటివ్
Also Read: IND vs NZ 1st Test: ఫలితాన్ని ‘రచిన్’చాడు.. డ్రాగా ముగిసిన తొలి టెస్టు!
Also Read: Ahmedabad Franchise: అహ్మదాబాద్.. ఇలా అయితే ఎలా.. ఐపీఎల్ 2022లో కష్టమే!
Also Read: CSK in IPL: చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎన్ని సంవత్సరాల కాంట్రాక్ట్ అంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి