మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కొత్త సీఈవోగా భారత సంతతి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో జాక్ డోర్సే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించారు. ప్రపంచ టాప్ టెక్ కంపెనీలను ముందుకు నడిపించే భారతీయుల జాబితాలో పరాగ్ అగర్వాల్ కూడా చేరారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, ట్విటర్‌, మైక్రాన్‌, మాస్టర్‌ కార్డ్‌ సంస్థలను భారత సంతతికి చెందిన వాళ్లు లీడ్ చేస్తున్నారు. 






పరాగ్ అగర్వాల్ కు కేటీఆర్ శుభాకాంక్షలు


టాప్ కంపెనీలను లీడ్ చేస్తున్న భారతీయులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, ట్విటర్‌, మైక్రాన్‌, మాస్టర్‌ కార్డ్‌ సంస్థల్లో ఓ కామన్ పాయింట్ ఉందని ట్వీట్ చేశారు. భారత్‌లో ఉన్నత చదువులు చదివిన వ్యక్తులే ఇప్పుడు ఈ కంపెనీ సీఈవోలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. భారతీయులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పరాగ్‌ అగర్వాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.


Also Read:  రూ.17 వేలలోనే రెడ్‌మీ సూపర్ 5జీ ఫోన్.. త్వరలో మార్కెట్లోకి!


భారతీయ సీఈవోలు


మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా హైదరాబాద్‌కు చెందిన సత్య నాదెళ్ల బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గూగుల్‌ సీఈవోగా తమిళనాడుకు చెందిన సుందర్‌ పిచాయ్‌, అడోబ్‌ సీఈఓగా హైదరాబాద్‌కి చెందిన శంతను నారాయణ్, ఐబీఎం సీఈవోగా ఏపీకి చెందిన అరవింద్ కృష్ణ సేవలు అందిస్తున్నారు. మైక్రాన్‌ టెక్నాలజీ సీఈవోగా కాన్పూర్‌కి చెందిన సంజయ్ మెహ్రోత్రా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పుణెకి చెందిన అజయ్‌ బంగా మాస్టర్‌ కార్డ్‌ భారత్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. 


Also Read: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?


ఎలన్ మస్క్ ట్వీట్


ట్విట్టర్ సంస్థ సీఈవోగా భారతీయ అమెరికన్ ప‌రాగ్ అగ‌ర్వాల్‌ నియామకంపై టెస్లా సీఈవో ఎల‌న్ మ‌స్క్ స్పందించారు. ప్రతిభావంతులైన భార‌తీయుల వ‌ల్ల అమెరికా ల‌బ్ధి పొందుతున్నట్లు మ‌స్క్ ట్వీట్ చేశారు. 


Also Read: ట్విట్టర్ సీఈవోగా మనోడు.. టెక్ కంపెనీల్లో కొనసాగుతున్న భారతీయుల హవా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి